బంధువులు, స్నేహితుల నుంచి సరైన సహాకారం లభించకపోతే క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే లోన్ తీసుకునే విషయంలో క్రెడిట్ కార్డు లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అన్న
అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం ఏర్పడితే స్నేహితులు లేదా బంధువులు వద్ద అప్పు తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి వద్ద నుంచి సరైన సహాకారం లభించకపోతే క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే లోన్ తీసుకునే విషయంలో క్రెడిట్ కార్డు లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అన్న సందిగ్ధత చాలా మందిలో ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్ధిక నిపుణులు దేనిని సూచిస్తున్నారో చూద్దాం.
ఏది బెస్ట్:
* క్రెడిట్ కార్డుపై పలు బ్యాంకులు లోన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డుపై ఉన్న పరిమితిని వినియోగించుకోలేని సందర్భంలో ఆ మేరకు కొంత మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
* పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుపై లోన్ రెండింటిలో వడ్డీ రేట్లు, రుణ మంజూరీకి సంబంధించిన ఫీజు దాదాపు సమానమే.
* లోన్ తీసుకున్న తర్వాత తగ్గుతున్న నిల్వ ఆధారంగా వడ్డీ రేటును లెక్కిస్తారు.
* ఈ రెండు లోన్లను నెలవారీ వాయిదాల (ఈఎంఐ)ల ద్వారా చెల్లించవచ్చు.

* పర్సనల్ లోన్‌ని కొన్ని ఈఎంఐలు చెల్లించిన తర్వాత ముందస్తుగా మొత్తం రుణాన్ని చెల్లించడానికి కొన్ని బ్యాంకులు అనుమతిస్తాయి. క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణాన్ని కూడా ముందుగానే చెల్లించవచ్చు.
* పర్సనల్ లోన్‌పై వార్షిక వడ్డీ రేటు 15.5-24 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డు రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు 3 శాతం ప్రీపేమెంట్ పెనాల్టీ ఉంటుంది. వ్యక్తిగత రుణంపై మాత్రం ఇది ఉండదు.
* క్రెడిట్ కార్డు లోన్, పర్సనల్ లోన్ దాదాపు ఒకే విధంగా కనిపించినా కొన్ని మాత్రం వేరుగా ఉంటాయి. ఉదాహరణకు.. పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి ఆ బ్యాంకు కస్టమర్‌గా ఉండాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు లోన్‌కి మాత్రం బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగి ఉండాలి.
* తక్కువ మొత్తంలో లోన్ అవసరం ఉంటే క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటే మంచింది.
* ఎక్కువ మొత్తం రుణం కావాలనుకుంటే మాత్రం వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది.
* పర్సనల్ లోన్ పొందాలనుకునే వారి ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ లోన్ వస్తుంది.
* క్రెడిట్ కార్డుపై లోన్ పొందడం సులభం. ఈ లోన్‌కి దరఖాస్తు చేసే సందర్భంలో ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లోన్‌ని ఆన్‌లైన్ ద్వారా లేదా బ్యాంకు హెల్ప్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. కొన్ని గంటల్లోనే ఈ లోన్‌కి అనుమతి లభిస్తుంది. వెంటనే సొమ్ము ఖాతాలో జమవుతుంది.
* పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చిరునామా, బ్యాంకు స్టేట్‌మెంట్స్, సాలరీ స్లిప్‌లను బ్యాంకుకు సమర్పించాలి. వీటిన్నింటినీ పరిశీలించి లోన్ మంజూరు చేయడానికి రోజుల సమయం పడుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications