ప్రధాని నరేంద్రమోడీ 'జనధన్ యోజన' పథకం ద్వారా సామాన్యులకు సైతం బ్యాంకింగ్ సేవలను దగ్గర చేర్చారు. ఈ నేపథ్యంలో విలువైన వస్తువులు, పత్రాలు దాచుకోవడానికి చాలా మంది బ్యాంకులనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా నగలు, బంగారం లాంటివాటిని బ్యాంకు లాకర్‌లోనే దాస్తున్నారు.
సాధారణంగా బ్యాంకు లాకర్‌ను కేటాయించినపుడే బ్యాంకు అధికారులు ఆ లాకర్‌ను వినియోగించడానికి ఒక తాళం చెవిని ఇస్తారు. మరో తాళం చెవి బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉంటుంది. ఈ రెండు తాళం చెవులు ఉంటేనే తప్ప లాకర్ ఓపెన్ కాదు. ఎప్పుడైనా తాళం చెవిపోతే పరిస్థితి ఏంటీ అని ఆలోచించారా?
ఖాతాదారుడి వద్ద ఉన్న తాళం చెవిపోతే, ఏం చేయాలి. బ్యాంకులు కొత్త తాళం చెవిని ఇస్తాయా? కొత్త తాళం చెవి తీసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.

ఖాతాదారుడితే బాధ్యత
బ్యాంకు లాకర్‌లో ఉండే వస్తువులను క్రమ పద్దతిలో పెట్టుకోవడం, లాకర్ తాళం చెవిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఖాతాదారుడి బాధ్యత. మీ పొరపాటు వలన లాకర్ తాళం పోయి, లాకర్‌లోని వస్తువులు పోతే అందుకు బ్యాంక్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. లాకర్ కేటాయింపుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉంటుంది.

లాకర్ బుక్‌లో సంతకం
లాకర్ ఓపెన్ చేసే ప్రతిసారి ఖాతాదారుడు బ్యాంక్ లాకర్ బుక్‌లో సంతకం చేయాలి. ఆ తర్వాతే బ్యాంక్ సిబ్బంది వచ్చి తమ దగ్గర ఉన్న తాళం చెవి, మీ దగ్గర ఉన్న తాళం చెవి ఉపయోగించి లాకర్ ఓపెన్ చేస్తారు. ఒకవేళ పోయిన లాకర్ కీ ఎవరో కేటుగాడికి దొరికి, బ్యాంకు అధికారులు ఏమరుపాటుతో ఖాతాదారుడి వివరాలు సరిగా చెక్ చేయకుండా ఓపెన్ చేస్తే.. మీ లాకర్‌లో ఏమీ ఉండవు.

బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి
ముందుగా బ్యాంక్ లాకర్ తాళం చెవి పోయిన వెంటనే ఖాతాదారులు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్ అధికారులకు తెలియజేయాలి. దాంతో బ్యాంక్ అధికారులు ఆ లాకర్ ఎవరూ ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకుంటారు. తాళం చెవి పోయిన విషయం బ్యాంకుకు తెలియజేసేటపుడే మీ కీ లేదా లాకర్ నంబర్ తెలియజేయాలి.

కొత్త తాళం చెవి
తాళం చెవి పోయిందని తెలియజేశాక, బ్యాంకులు ఆ లాకర్‌ను తయారు చేసిన కంపెనీ ప్రతినిధిని పిలిపించి ఖాతాదారుడి సమక్షంలో లాకర్‌ను బ్రేక్ చేసి ఓపెన్ చేస్తారు. తర్వాత కొత్త లాకర్ తాళం చెవి ఇస్తాయి. ఇందుకోసం బ్యాంకులు రూ. 250 నుంచి రూ.500 వరకు సర్వీస్ చార్జీ లేదా జరిమానా కింద వసూలు చేస్తాయి. లాకర్ బ్రేకింగ్, మళ్లీ కొత్తగా ఇచ్చే తాళానికి కూడా కలుపుకుంటే మొత్తం రూ.3,000 వరకు ఖర్చవుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications