ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా? (ఫోటోలు)

రాము ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కూడా చాలా తక్కువ. అన్ని అలవెన్సులు కలిపితే 10 వేల రూపాయల దాకా చేతికి వస్తుంది. అయితే తన చెల్లి పెళ్లి కోసం అతనికి రూ. లక్షన్నర వరకు అవసరం ఏర్పడింది. దీంతో బ్యాంకును ఆశ్రయించగా మొండి చెయ్యే ఎదురైంది. తాకట్టు పెట్టేందుకు బంగారం కూడా లేక ఏం చేయాలో తోచక రాము దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.

ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫాంలో రుణం కోసం ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడు. దాంతో ఇంటర్నెట్‌లోని ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫాంని సంప్రదించగా.. కొందరు రుణదాతలు లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

మన దేశంలో నిబంధనల కారణంగానూ బ్యాంకులు కొందరికి రుణాలివ్వలేకపోతున్నాయి. నిర్దిష్ట స్థాయికి మించి జీతం ఆర్జిస్తున్న లేదా కొంత పేరున్న కంపెనీల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే బ్యాంకులు వ్యక్తిగత రుణాలిస్తున్నాయి. ఇండియాలోనే కాదు దాదాపు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి.

ఇలాంటి వారికోసం ఆన్‌లైన్‌లో పీర్ టు పీర్ లెండింగ్ సేవలకు అవకాశం కల్పించే ప్లాట్‌ఫాంలు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్‌లో కొన్ని ప్లాట్‌ఫాంలు రుణగ్రహీతలను, రుణదాతలను సంప్రదించే వీలుకల్పిస్తున్నాయి. భారత్‌లోనైతే వ్యక్తుల నుంచి నేరుగా అప్పు తీసుకోవడం అనాదిగా కొనసాగుతున్న వ్యవహారమే.

అయితే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం విషయంలో మాత్రం మధ్యవర్తి ప్రమేయం కూడా ఉంటుంది. రుణగ్రహీత విషయంలో రుణదాతలకు లెండింగ్ ప్లాట్‌ఫాం జవాబుదారీగా ఉంటుంది. ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫాం కూడా బ్యాంక్ లాగే పనిచేస్తుంది. రుణగ్రహీతలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడంతోపాటు వారికి ఎంత రుణం ఇవ్వవచ్చు, వారికి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఏమేర సామర్థ్యం ఉంది అన్న అంశాలను విశ్లేషిస్తుంది.

అంతేకాదు రుణాన్ని నెలవారీ ఈఎంఐ చొప్పున కట్టేందుకు వీలుంటుంది. అయితే రుణం కోరగోరే వారి ఆర్థిక స్థితిగతులు, తిరిగి చెల్లింపు సామర్థ్యం ఆధారంగా వడ్డీరేటును నిర్ణయించడం జరుగుతుంది. నష్ట భయం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అధిక వడ్డీరేటు విధిస్తారు. రిస్క్ లేదన్పిస్తే తక్కువ వడ్డీరేటుకే రుణం లభించవచ్చు.

ఈ ప్లాట్‌ఫాంల ద్వారా తీసుకునే రుణంపై వడ్డీరేటు 0-36 శాతం మధ్యలో ఉండొచ్చు. మీ ప్రొఫైల్‌ను బట్టి రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ లభించే అవకాశం ఉంటుంది. బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా మీరే బ్రాంచ్‌కెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించడమో లేదా ఎగ్జిక్యూటివ్ మీ వద్దకు వచ్చి డాక్యుమెంట్లు స్వీకరించడమో జరుగుతుంది.

కానీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల విషయంలో రుణగ్రహీతలు కేవైసీ కోసం అవసరమైన ఇతర పత్రాలను( ఫొటో, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఐటీ రిటర్నులు ) స్కాన్ చేసి పంపాల్సి ఉంటుంది. చాలా వరకు ప్లాట్‌ఫాంలు రుణగ్రహీతల నుంచి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

హైదరాబాద్ నగరవాసులకు ఆన్‌లైన్‌లో రుణ సేవలందిస్తున్న ఐ-లెండ్.ఇన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో రూ.500 వసూలు చేస్తున్నది. మరో ప్రముఖ ప్లాట్‌ఫాం ఫెయిర్‌సెంట్.కామ్ అయితే రూ.1,500 రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేస్తుంది. మరికొన్ని కంపెనీలు కేవైసీ వెరిఫికేషన్ కోసం అయ్యే ఖర్చులను రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో వసూలు చేస్తున్నాయి.

 ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు కూడా రుణం కోరేవారి గత చరిత్రను (ఉదా. సిబిల్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చే స్కోరు )పరిగణలోకి తీసుకుంటాయి. కొన్ని ప్లాట్‌పాంలైతే క్రెడిట్ స్కోర్‌తోపాటు సోషల్ మీడియా సైట్లలో వారి పార్టిసిపేషన్ , ఫ్రెండ్స్ వివరాలను కూడా పరిశీలించి వారికి క్రెడిట్ స్కోర్‌ను కేటాయిస్తాయి. పలు అంశాల ఆధారంగా రుణగ్రహీతలకు రిస్క్ కేటగిరీలను నిర్ణయిస్తాయి.

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా రుణాలివ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని అనుకుంటున్నవారు సైతం కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని ప్లాట్‌ఫాంలు మాత్రం రుణదాతల నుంచి సైతం రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రుణ ఒప్పందంపై సంతకాలు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నదని, ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాక రుణదాతకు, రుణగ్రహీతకు ఒప్పంద పత్రాలు పంపడం జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్‌లో రుణం పొందడమెలా?

ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫాంలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి ఇంకా అధికారిక గుర్తింపు లేదు. ఈ లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించేవరకు ఆన్‌లైన్‌లో రుణాలివ్వడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించాలనుకునేవారు మాత్రం కొంత ఆచితూచి వ్యహరించడం మేలని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+