మనలో చాలా మందికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికినప్పుడు మాత్రం భారీ జరిమానా చెల్లిస్తుంటారు. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందులను ఎదుర్కొన్నా, వాహన ఇన్సూరెన్స్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు.
అయితే మరికొంత మంది ఎప్పటికప్పుడు వాహన బీమా చెల్లిస్తున్నప్పటికీ, అందుకు సంబంధించిన పత్రాలు వాహనంలో లేకపోవడం వల్ల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డిఎఐ) ఇటీవలే డిజిటల్ మోటార్ బీమాగా పేర్కొనే ఇ-వాహన్ బీమాను ప్రారంభించింది.
ఈ క్రమంలో అసలు ఇ-వాహన్ బీమా అంటే ఏంటి? అసలు వాహన బీమా తీసుకోవడం వల్ల ప్రయోజం ఉంటుందా? అనే విషయాలను తెలుసుకుందాం. ఇ-వాహన్ బీమా కాన్సెప్ట్‌ను దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

దీంతో దేశంలోని మిగతా దేశాలు కూడా ఇ-వాహన్ బీమాను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇ-వాహన్ బీమాను బీమా కంపెనీలు డిజిటల్ రూపంలో జారీ చేస్తాయి. దీనికి ఒక క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను ట్రాఫిక్ పోలీసులు స్కాన్ చేస్తే ఇ-వాహన్ బీమా పాలసీకి సంబంధించిన వివరాలు మొత్తం తెలుస్తాయి.
ఇ-వాహన్ బీమా ప్రత్యేకతలివే:
* ఇ-వాహన్ బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలోనే కాకుండా హార్డ్ కాపీ కూడా పొందవచ్చు.
* ఈ పాలసీని కొనుగోలు చేసినప్పుడు లేదా రెన్యూవల్ చేసినప్పుడు డిజిటల్ రూపంలో ఉన్న పాలసీ సంబంధిత వివరాలు పాలసీదారుడికి ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్‌కు పంపిస్తారు.
* అంతేకాదు డిజిటల్ పాలసీ కాపీని రిజిస్టరైన ఇ-మెయిల్ పంపుతారు.
* డిజిటల్ రూపంలో బీమా పాలసీలను జారీ చేయడం వల్ల కంపెనీలకు వ్యయాలు కలిసి వస్తాయి.
* అంతేకాదు వాహనదారులకు వెంటనే ఈ పాలసీలను జారీ చేయొచ్చు. ఈ విధానం వల్ల మోసాలు కూడా తగ్గుతాయి.
* కస్టమర్లకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది.
* బీమా సంస్థలు సొంతంగా లేదా ఇన్సూరెన్స్ రిపాజిటరీల ద్వారా ఎలక్ర్టానిక్ పాలసీలను జారీ చేయవచ్చు.
* మోటార్ వెహికిల్ చట్టం 1988 ప్రకారం.. బీమా లేకుండా మోటార్ వాహనాన్ని నడిపితే శిక్షార్హులు.


Click it and Unblock the Notifications