2016: సరైన ప్రణాళికతో అధిక రాబడులు

బెంగుళూరు: కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో గతేడాది చేసిన పొరపాట్లు, తప్పులను సమీక్షించుకుని అధిక రాబడుల కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలి. అంతేకాదు గతేడాది పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి వ్యూహాలకూ పదును పెట్టాల్సిన సమయం వచ్చింది.

దీనిపై ఇప్పటికే చాలా మంది మదుపుదారులు కసరత్తు చేసి ఉంటారు. స్టాక్ మార్కెట్లు, షేర్లపై అవగాహన ఉన్న వారు ఇప్పటికైనా సిద్ధం కావాలి. అయితే పెట్టుబడులు, పొదుపు గురించి తెలియని వారు కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకునే వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సరి.

 పెట్టుబడి విషయంలో పొరపాట్లు

పెట్టుబడి విషయంలో పొరపాట్లు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల విషయంలో చాలా మంది అనేక పొరపాట్లు, తప్పులు చేస్తుంటారు. అయితే మళ్లీ మళ్లీ అవే తప్పులు, పొరపాట్లు చేయకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. 2016లో ఎలాంటి తప్పులు చేయకపోతే దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల సంపద ఎంత లేదన్నా రెండు శాతం వరకు పెరుగుతుందని అమెరికాలో జరిగిన ఒక సర్వేలో తేలింది. మీరు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలనకుంటే ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి, ప్రమోటర్లకు సంబంధించిన బ్యాగ్రౌండ్‌, మారుతున్న ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికపుడు గమనించండి.

ఖర్చుపై నియంత్రణ అవసరం

ఖర్చుపై నియంత్రణ అవసరం

సాధారణంగా చాలా మందికి చెప్పుకోదగిన స్థాయిలో సంపాదన ఉంటుంది. అయితే కొంతమందికి ఖర్చులపై సరైన నియంత్రణ ఉండదు. చేతికి వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేస్తుంటారు. ఫైనాన్సియల్‌ ప్లానర్లకు వీరు చెప్పే ఖర్చులకు, అసలు ఖర్చులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. క్రెడిట్‌ కార్డులపై చేసిన ఖర్చులు, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది ఖర్చులు వారి చెప్పే ఖర్చుల కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉంటాయి. తక్కువ సంపాదన ఉన్నా కొంతమంది చక్కటి ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులతో ఆర్థికంగా ఎదిగి పోతుంటారు. కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

కుటుంబ ఖర్చులను జీవిత భాగస్వామితో చర్చించండి

కుటుంబ ఖర్చులను జీవిత భాగస్వామితో చర్చించండి

ఇంటికి సంబంధించినంత వరకు మీ భార్యతో ఖర్చుల గురించి ముందుగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కుటుంబ బడ్జెట్‌లో అయినా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. మీ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడి వివరాలను మీ భార్యతో క్షుణ్ణంగా చర్చించండి. ఆ తర్వాతే పెట్టుబడులు, పొదుపులపై నిర్ణయం తీసుకోండి.

 గత అనుభవాలతో నిరాశ చెందొద్దు

గత అనుభవాలతో నిరాశ చెందొద్దు

గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ బాధపడొద్దు. ప్రస్తుత మార్కెట్లో మంచి అవకాశాలు ఉంటే వాటిని అందిపుచ్చుకోవాలి. మళ్లీ ఎక్కడ నష్టపోతామో అన్న భయం పెట్టుకోకూడదు. ఉదాహరణకు 2008 సంవత్సరం నాటి స్టాక్‌ మార్కెట్‌ పతనం అనుభవంతో చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇప్పటికీ మార్కెట్‌కు దూరంగా ఉన్నారు. వీరంత తమ మిగులు నిధులను బ్యాంక్‌ డిపాజిట్లు లేదా నష్ట భయం పెద్దగా లేని రుణ పత్రాల్లో మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు.

 పెట్టుబడికి నూతన మార్గాలు

పెట్టుబడికి నూతన మార్గాలు

భారతీయుల్లో చాలా మంది ఏదో ఒక పెట్టుబడికే మాత్రమే పరిమితం అవుతుంటారు. ఉదాహరణకు ప్రాచీన కాలం నుంచి చాలా మందికి బంగారం కొనుగోలు చేసి దాచుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. కానీ, గత ఐదేళ్లలో బంగారానికి పెట్టుబడి రూపంలో మంచి డిమాండ్ వచ్చింది. అంతేకాదు గత ఐదేళ్ల కాలంలో భారతీయులు కొన్న బంగారం విలువ 2,500 కోట్ల డాలర్లు పైమాటే. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.1.65 లక్షల కోట్లకు సమానం. కాబట్టి సంప్రదాయ పెట్టుబడి మార్గాలకు స్వస్తి చెప్పి కొత్త వాటిల్లో పెట్టుబడి పెడితే మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+