సివివి, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ప్రాముఖ్యత ఏంటీ?
ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి సివివి(కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ కోడ్), ఒటిపి (వన్‌టైమ్ పాస్‌వర్డ్) గురించి తెలిసే ఉంటుంది. అయితే వీటి ప్రాధాన్యం తెలియని వారు, తెలిసిన వారు కూడా మోసాల బారిన పడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తమ సొమ్మును తిరిగి రాబట్టుకోలేక పోతున్నారు.
ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వెనుక భాగంలో ఉండే సివివి నెంబర్‌ను వినియోగదారుడి ద్వారానే తెలుసుకుని మోసాు చేస్తుండటం ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. రుణాలు ఇచ్చేందుకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ తెలియజేయాలని లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని ఆందోళనకు గురిచేస్తూ ఫోన్లు చేస్తున్నారు.
చాలా మంది అమాయకులు తమ కార్డును వినియోగించిన సందర్భంలో మొబైల్ నెంబర్‌కు వచ్చే ఒటిపి నెంబర్‌ను కూడా ఫోన్ చేసిన వారికి చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన మోసాన్ని తెలుసుకుని ఏడుస్తున్నారు. ఈ నేపథ్యంలో సివివి, ఒటిపిలకు ఉన్న ప్రాధాన్యం ఏంటో చూద్దాం.

సివివి, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ప్రాముఖ్యత ఏంటీ?
క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ముందుభాగంలో 16 నెంబర్లు ఉంటాయి. కార్డు వెనుకభాగంలో నల్లటి మాగ్నెటిక్ స్ట్రిప్ కింద మూడు నెంబర్లు ఉంటాయి. వీటినే సివివి అంటారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించిన సందర్భంలో 16 నెంబర్లతో పాటు సివివి నెంబర్‌ను కూడా నమోదు చేయాలి. కార్డును కలిగి ఉన్నట్టుగా నిర్ధారించేందుకు ఈ నెంబర్‌ను అడుగుతారు.

సివివి, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ప్రాముఖ్యత ఏంటీ?
కార్డు నెంబర్ వేరే వాళ్లకు తెలిసినా సివివి నెంబర్ లేకుండా ఎలాంటి లావాదేవీ నిర్వహించలేరు. అయితే సివివి నెంబర్ తెలిస్తే ఎవరైనా లావాదేవీలు జరిపే అవకాశం ఉన్నందున సెక్యూరిటీని మరింతగా పెంచారు. ఇందులో భాగంగానే వినియోగదారుడి మొబైల్‌కు ఒటిపి పంపుతున్నారు.

సివివి, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ప్రాముఖ్యత ఏంటీ?
ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు నిర్వహించేటప్పుడు పేమెంట్‌ను అనుమతించేందుకు గాను రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లేదా పేమెంట్ గేట్‌వే ఒక ఒటిపి నెంబర్‌ను పంపిస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్ చేసినప్పుడే లావాదేవీ పూర్తవుతుంది. ఒక్కసారి మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఒటిపి కాలపరిమితి పది నిమిషాలు మాత్రమే ఉంటుంది.

సివివి, వన్‌టైమ్ పాస్‌వర్డ్ ప్రాముఖ్యత ఏంటీ?
ఒకసారి ఈ నెంబర్ రాకపోతే మరోసారి కూడా ఓటిపిని పొందవచ్చు. తాజాగా 3డీ సెక్యూర్ పిన్ నెంబర్ అనేది కూడా పేమెంట్ గేట్‌వే పంపిస్తుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే సందర్భంలో కార్డు వివరాలతో పాటు దీనిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక ఆఫ్ ఇండియా 3డి సెక్యూర్ పాస్ వర్డ్ తప్పనిసరి చేసింది. దీని వల్ల కార్డు పోయినా దుర్వినియోగం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.


Click it and Unblock the Notifications