సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
న్యూఢిల్లీ: బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకోవాలనున్నా, రుణం కావాలన్నా మీ క్రెడిట్ స్కోరు ఎంత? అని అడుగుతుంటారు. సాధారణంగా చాలా మందికి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు విషయంలో అవగహన ఉండదు. తెలియకుండానే క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేశాక అవి తిరస్కరణకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే అంశాలేమిటో తెలుసుకుందాం.
సాధారణంగా సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇందులో 750కి మించి స్కోరు ఉంటే మీరు లోన్ పొందేందుకు అన్ని విధాలా అర్హులని చెప్పొచ్చు. మీరు ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి ఎలా చెల్లిస్తున్నారు అనేది ఎంతో కీలకం.
సాధారణంగా అన్ని బ్యాంకులూ లోన్ ఇచ్చే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి రుణ చరిత్ర, సిబిల్ స్కోరును పరిశీలించాకే లోన్ లేదా క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. దీనిని బట్టి లోన్ పొందేందుకు ప్రతి వ్యక్తి కూడా మంచి రుణ చరిత్రను కలిగి ఉండటం ఎంతో ముఖ్యం.

సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
వాటిని ఎలా అధిగమించాలి అనేది తెలుసుకుందాం. బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత దానికి నెలసరి వాయిదాలను సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత తీసుకున్న వారిపై ఉంటుంది. సాధారణంగా రుణ వాయిదాలు నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లిస్తుంటారు. అయితే, ఆ సమయానికి బ్యాంకు ఖాతాలో తగినంత నిల్వ లేకపోతే వాయిదా చెల్లింపు నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఈ లావాదేవీ గురించి సిబిల్‌లో నమోదవుతుంది. ఫలితంగా మీ సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరుపై ప్రభావం పడుతుంది.

సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
దీని కోసం ఏం చేయాలంటే ప్రతి నెలా వాయిదా సమయానికి మీ ఖాతాలో తగినంత నిల్వ ఉండేలా చూసుకోవాలి. ప్రతి నెలా వాయిదాల చెల్లింపు సరిగా జరుగుతోందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డులకు సంబంధించి బిల్లులను వ్యవధిలోగా చెల్లించాలి. గడువు పూర్తయిన తర్వాత చెల్లించడం, అసలు చెల్లించకపోవడం రెండూ కూడా జరిమానాలు విధించేందుకు కారణం అవుతాయి.

సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు మరచిపోకుండా చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకటి రెండు రోజుల ముందుగానే బిల్లు చెల్లించే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక సూత్రం ప్రకారం ఆదాయం అధికంగా ఉండాలి. అప్పులు తక్కువగా ఉండాలి. రుణాలు అధికంగా ఉంటే ఆర్థికంగా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నట్లే. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.

సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
బ్యాంకుల నుంచి ఎక్కువగా రుణాలు తీసుకున్నట్లైతే, కొత్తగా అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. కాబట్టి, కొత్త అప్పు కోసం దరఖాస్తు చేసుకునే ముందు వీలైనంత వరకూ చిన్న చిన్న అప్పులన్నింటినీ ముగించేయాలి. దీనివల్ల రుణాల సంఖ్య తగ్గి, మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు మెరుగుపడేందుకు వీలు కలుగుతుంది. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు సక్రమంగా ఉంటేనే అవసరానికి అప్పులు తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.

సిబిల్ స్కోరు ఎంత ఉంటే లోన్ పొందేందుకు అర్హులు?
ప్రతి క్రెడిట్ కార్డుకూ ఒక పరిమితి ఉంటుంది. దాన్ని మించి ఖర్చు చేస్తున్నారంటే ఆర్థికంగా మీరు కొంత ఇబ్బందుల్లో ఉన్నట్లే. కార్డు పరిమితిని పూర్తిగానూ, లేదా అంతకు మించి వాడినప్పుడు అది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు క్రెడిట్ కార్డు పరిమితిని మించి వాడకూడదు. సాధ్యమైనంత వరకూ ఖర్చులను వాయిదా వేసుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications