తెలియకుండానే క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందా?

క్రెడిట్ కార్డుల వాడ‌కం నోట్ల మార్పిడి(ర‌ద్దు) త‌ర్వాత బాగా ఎక్కువ‌యింది. ఎక్క‌డ కాస్త అజాగ్ర‌త్త ప‌డినా క్రెడిట్ కార్డు వాడ‌కం విష‌యంలో కాస్త ఇబ్బంది ప‌డతాం. క్రెడిట్ కార్డుకు సంబంధించి అన్నీ స‌రిచూ

మాధవ్ ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్ పని నిమిత్తం సింగపూర్ వెళ్లాడు. తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు తన భార్యా పిల్లల కోసం ఏదైనా కొందామని షాపింగ్‌కు వెళ్లాడు. షాపింగ్ అంతా పూర్తయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్‌లో క్రెడిట్ కార్డు ఇచ్చాడు. క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని బిల్ కౌంటర్ సిబ్బంది చెప్పారు.

దీంతో షాక్‌కు గురైన మాధవ్ వ్యాలెట్‌లో ఉన్న మరో కార్డుతో బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. సాధారణంగా క్రెడిట్ కార్డు బ్లాక్ చేయాల్సి వస్తే బ్యాంకులు ఆ విషయాన్ని ముందుగానే ఖాతాదారుడికి తెలియజేస్తాయి. కానీ ఇక్కడ రమేశ్‌కు తన కార్డు బ్లాకింగ్ గురించి బ్యాంక్ వర్గాలు ముందుగా తెలియజేయలేదు.

దీంతో మాధవ్ వెంటనే బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ ఎందుకు జరిగిందిలా? అని బ్యాంకు వర్గాలను ప్రశ్నించాడు. కాల్‌ సెంటర్‌ సిబ్బంది సారీ ఎప్పుడూ లేని విధంగా మీ క్రెడిట్‌ కార్డు విదేశాల్లో వాడడంతో, ఎవరో మీ కార్డు కొట్టేసి అక్కడ వాడుతున్నారనుకున్నాం. దాంతో ముందు జాగ్రత్తగా కార్డు బ్లాక్‌ చేశాం అని చెప్పారు.

మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందంటే..

స్థాయికి మించి కొనుగోళ్లు

స్థాయికి మించి కొనుగోళ్లు

క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకులు మీ కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. మీ స్థాయికి మించి కొనుగోళ్లు చేశారని అనుమానం కలిగితే వెంటనే క్రెడిట్ కార్డును బ్లాక్ చేస్తాయి. ఉదాహరణకు మాధవ్ అనే వ్యక్తికి 75 వేల రూపాయల పరిమితితో ఒక బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు జారీ చేసింది. మాధవ్ కూడా ఇంట్లోకి అవసరమైన చిల్లర సరుకులు, యుటిలిటీ బిల్లుల చెల్లింపుల కోసమే ఆ కార్డు ఉపయోగించే వాడు. వీటి కోసం నెలవారీ బిల్లు ఎపుడూ 15 వేలు దాటదు. కానీ ఒకరోజు మాధవ్ ఓ విదేశీ హోటల్‌లో 70 వేల రూపాయలు పెట్టి రూమ్‌ బుక్‌ చేశాడు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు అనుమానంతో క్రెడిట్ కార్డుని బ్లాక్ చేస్తాయి.

సరిగ్గా చెల్లింపులు చెల్లించకపోతే

సరిగ్గా చెల్లింపులు చెల్లించకపోతే

కొంతమంది క్రెడిట్‌ కార్డు బకాయిలను సక్రమంగా చెల్లించకుండా ఉంటే క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేస్తాయి. క్రెడిట్‌ ఏజెన్సీ ద్వారా బ్యాంకులు ఎప్పటికపుడు ఖాతాదారుల చెల్లింపుల విషయం తెలుసుకుంటాయి. ఒకే బ్యాంకు నుంచి అనేక క్రెడిట్‌ కార్డులు తీసుకున్నా సరైన సమయంలో చెల్లింపులు జరపకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డును బ్లాక్‌ చేసే అవకాశం ఉంది.

విదేశాల్లో ఉపయోగించడం

విదేశాల్లో ఉపయోగించడం

మన దేశంలో క్రెడిట్ కార్డు ఉపయోగించే వ్యక్తి సడన్‌గా విదేశాల్లో ఆ కార్డును ఉపయోగిస్తే బ్యాంకులు అధికారులకు అనమానం వస్తుంది. క్రెడిట్ కార్డుని ఎవరైనా కొట్టేసి విదేశాల్లో షాపింగ్‌ చేస్తున్నారని అనుమానిస్తాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీకు క్రెడిట్‌ కార్డు జారీ చేసిన బ్యాంకుకు, మీరు విదేశాలకు వెళ్తున్న విషయాన్ని ముందే తెలియజేస్తే మంచిది.

సాంకేతిక పొరపాట్లు

సాంకేతిక పొరపాట్లు

ఒక్కోసారి బ్యాంకులో జరిగే సాంకేతిక పొరపాట్ల వలన కూడా మీ క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకులు అధునాతన పేమెంట్‌ సిస్టమ్స్‌ను ప్రవేశపెట్టినపుడు లేదా టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసినపుడు ఇలాంటి సమస్య ఎదురవుతుంది. మనం చెల్లింపులు చేసే షాపు యాజమాన్యం తన సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయక పోయినా ఈ సమస్య వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+