మనం సంపాదించిన డబ్బును కాపడటం, దానిని అంతకింత అభివృద్ధి చేయడం అనేది ఒక కళ. ‘మీరు రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే' అనే మాటను బెంజమిన్ ఫ్రాంక్లిన్. మనలో చాలా మందికి డబ్బు ఆదా చేయాలని ఉంటుంది, కానీ చాలా వరకు అశ్రద్ధ వహిస్తుంటారు.
డబ్బును ఆదా చేసేందుకు రెండు ఉత్తమ మర్గాలున్నాయి. ఒకటి పొదుపు కాగా, రెండోది పెట్టుబడి. అయితే ముందుగా మనం పొదుపు, పెట్టుబడికి మధ్య తేడా తెలుసుకోవాలి. మీరు సంపాదిస్తున్న దాంట్లో మీ ఖర్చులు పోను మిగిలిన సంపాదన మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో కూడబెడితే అది పొదుపు. మిగిలిన సంపాదనను అధిక రాబడి అందించే సాధనాల్లో పెడితే దానిని పెట్టుబడి అంటారు.

పొదుపు అంటే భద్రత
సాధారణంగా పొదుపు కోసం మనం ఎక్కువగా ఉపయోగించేది బ్యాంక్ ఆకౌంట్‌నే. పొదుపు యొక్క ముఖ్య లక్షణం భద్రత. పొదుపులో ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే పొదుపు చేసే డబ్బు పెరుగుదల అంత ఎక్కువగా ఉండదు. పెరుగుదల ఉన్నా కూడా అది స్వల్పం. అంతేకాదు పొదుపు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. అందుకని ఆ పొదుపును పెట్టుబడి రూపంలోకి మార్చాలి.

పెట్టుబడి వల్ల సంపద వృద్ధి
సాధారణంగా స్టాక్‌మార్కెట్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం, కమోడిటీస్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. పెట్టుబడి అనేది మీ సంపాదన మొదలైన రోజు నుంచే ప్రారంభమవ్వాలి. ఇలా పెట్టుబడి ద్వారా వచ్చిన సంపద పిల్లల కాలేజీ ఫీజులు, పెళ్లిళ్లు, సెలవుల్లో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా గడపటానికి ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది

పెట్టుబడిలో రిస్క్
పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా అధికంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు పెట్టుబడిలో రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ లేకుండా రాబడిని పొందలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బంగారంలో పెట్టుబడి
బంగారంలో పెట్టుబడులు పెట్టడం అంత సముచితమైనది కాదు. బంగారం కొనడమనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదనే ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. కష్టకాలంలో మనలను ఆదుకునే విలువైన వస్తువుగానే దాన్ని పరిగణించాలి.
మీ దగ్గర డబ్బులుండి, మీకు ఆభరణాలంటే ఇష్టముంటే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయండి. ఇది పెట్టుబడి కాదని, కేవలం వినియోగం కోసమే అన్న అవగాహనతో ఉండాలి. గత కొన్నేళ్లుగా బంగారంలో పెట్టుబడులు చెప్పుకోదగ్గ లాభాలనిచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications