చిన్న మొత్తంలో సంపాదించే ఉద్యోగులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతుంటారు. అంతేకాదు ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టే పెట్టుబడులు అత్యంత సురక్షితమైనవి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీర్ఘకాలంతో పోలిస్తే ఫిక్సెడ్ డిపాజిట్లు మిగతా వాటితో ఎక్కువ సంపదను సృష్టించడంలో వెనుకబడి ఉంటాయి.
ఇందుకు కారణం ఫిక్సెడ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణంతో పోలిస్తే తక్కువగా ఉండటమే. గడచిన గత రెండేళ్ల కాలంలో భారత్‌లో ద్రవ్యోల్బణం సరాసరిన 9.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో ఫిక్సెడ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీని అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?
అంతేకాదు ఫిక్సెడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలపై పన్ను కూడా చెల్లించాల్సి ఉండటంతో 7 శాతానికి మించి డబ్బు పెరగదు. ఈ కారణంగానే ఫిక్సెడ్ డిపాజిట్లపై పెట్టే పెట్టుబడులు ఆధిక సంపదను సృష్టించ లేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?
ఉదహారణకు ఈరోజుల్లో రూ. లక్ష ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత ఆ మొత్తం రూ. 3.83 లక్షలు ( ఏడాదికి 7 శాతం రాబడితో) అవుతుంది. అదే డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే రూ. లక్ష కాస్త రూ. 5.11 లక్షలు(8.5 శాతం రాబడితో) అవుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?
అదే గనుక ఈ రూ. లక్షను ఈక్విటీ మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రూ. 13.44 లక్షలు (14 శాతం రాబడి, 8 శాతం ద్రవ్యోల్బణంతో) అవుతుంది. అంతేకాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడిపై వచ్చే వడ్డీకి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల ధనవంతులు కాలేరు, ఎందుకని?
ఇలా కాకుండా మీరు ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, అమలులో ఉన్న పన్ను స్లాబ్ ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్లే దీర్ఘకాల సంపద సృష్టికి ఫిక్సెడ్ డిపాజిట్ల కన్నా మ్యూచువల్ ఫండ్స్ మేలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications