పెన్షన్‌ ప్లాన్: మలి జీవితం హాయిగా (ఫోటోలు)

రిటైర్మెంట్ తర్వాత జీవితం నిశ్చింతగా గడపాలని కోరుకునే వారి కోసం బీమా రంగ సంస్థ కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంపాదించే శక్తి ఉన్న రోజుల్లో కొంత సొమ్ముని పెన్షన్ ప్రయోజనాల కోసం కేటాయించుకుంటే రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడిపేందుకు అవసరమైన ఆదాయాన్ని ఈ ప్లాన్ అందుబాటులోకి తెస్తుంది.

ఈ పాలసీదారుడుకు నిర్దిష్ట కాలపరిమితి తర్వాత జీవితకాలంపాటు పెన్షన్ లభించనుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అప్పటివరకు చెల్లించిన ప్రీమియం మొత్తంపై(పన్నులు, రైడర్‌ల ప్రీమియం మినహాయించి) 105 శాతాన్ని సమ్ అస్యూర్డ్‌గా చెల్లిస్తామని కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు.

అంతేకాదు పాలసీ ప్రీమియం చెల్లింపులకు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీసీసీ కింద పన్ను మినహాయింపు కూడా లభించనుందన్నారు. పాలసీ ప్రీమియాన్ని ఒకేసారి లేదా ఏడాదికోసారి చెల్లించే వీలుంటుంది. పాలసీ మొదటి ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితమైన ప్రయోజనాలు అందుతాయని, ఆరో సంవత్సరం నుంచి ప్రతి ఏటా బోనస్‌ను ప్రకటిస్తామన్నారు.

కనీస వయసు = 30 ఏళ్లు.
గరిష్ఠ వయసు (రెగ్యులర్‌, లిమిటెడ్‌ పే ప్లాన్లకు) = 55, సింగిల్‌ ప్రీమియంకు = 60 ఏళ్లు.
పాలసీ ప్రయోజనాలు పొందేందుకు కనీస వయసు = 45 ఏళ్లు, గరిష్ఠం = 70 ఏళ్లు
పాలసీ కాలపరిమితి : రెగ్యులర్‌ పే ప్లాన్‌ = 10 ఏళ్లు; సింగిల్‌ పే ప్లాన్‌ = 10, 15 ఏళ్లు
ప్రీమియం చెల్లింపు కాలపరిమితి : లిమిటెడ్‌ పే ప్లాన్‌ : 10, 12 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు కాలపరిమితి : ఏడాది, అర్ధ సంవత్సరం, త్రైమాసికం
నెలవారీ కనీస హామీ మొత్తం : కనిష్ఠం రూ. 2 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు.

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

పాలసీ ప్రారంభమైన మొదటి ఐదేళ్లు ముందు ప్రకటించిన శాతంలో అదనపు ప్రయోజనాలు పాలసీకి జమ అవుతాయి. రెగ్యులర్‌ లేదా లిమిటెడ్‌ ప్రీమియం ప్లాన్‌లకు హామీ మొత్తంగా ఎంచుకున్న సొమ్ములో 5 శాతం, సింగిల్‌ ప్రీమి యం ప్లాన్‌కు 2 శాతం అదనపు ప్రయోజనంగా ప్రతి ఏడాది జమ అవుతుంది. ఆరో ఏడాది నుంచి బోనస్‌ లభిస్తుంది.

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

ఈ పాలసీదారుడుకు నిర్దిష్ట కాలపరిమితి తర్వాత జీవితకాలంపాటు పెన్షన్ లభించనుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అప్పటివరకు చెల్లించిన ప్రీమియం మొత్తంపై(పన్నులు, రైడర్‌ల ప్రీమియం మినహాయించి) 105 శాతాన్ని సమ్ అస్యూర్డ్‌గా చెల్లిస్తామని కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు.

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటివరకు ఫండ్‌గా ఏర్పాటైన సొమ్ము నుంచి మూడింట ఒక వంతు ఎలాంటి పన్నులు లేకుండా చేతికి అందుకోవచ్చు. మిగతా మొత్తాన్ని నిర్దేశిత కాలపరిమితిలో క్రమం తప్పని ఆదాయం అందుకునేందుకు యాన్యువిటీ కొనుగోలుకు ఉపయోగించుకోవాలి.

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

కొటక్ నుంచి లైఫ్‌ ప్రీమియర్‌ పెన్షన్‌ ప్లాన్‌

ఆదాయపు పన్ను చట్టం 80సిసిసి సెక్షన్‌ కింద పన్ను రాయితీలు వర్తిస్తాయి. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌, పర్మనెంట్‌ డిజెబిలిటీ బెనిఫిట్‌ కూడా పొందవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+