పెట్టుబడికి రక్షణ... రాబడికి హామీ. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఒక్క ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు దాచుకోవాలనుకునే వారికి వెంటనే గుర్తుకువచ్చేవి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు.
ప్రధానంగా బ్యాంకుల్లో రెండు రకాల డిపాజిట్లు ఉంటాయి. ఒకటి డిమాండ్ డిపాజిట్లు, రెండోవి టర్మ్ డిపాజిట్లు. వీటితోపాటు మనందరికీ పరిచయం ఉన్న సేవింగ్ ఖాతా, కరెంట్ ఖాతాల డిమాండ్ డిపాజిట్లు. వీటిలో జమ చేసిన డబ్బులని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు.
కాల పరిమితి డిపాజిట్ల విషయానికి వస్తే, ఇందులో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి.

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి ఇలా?
ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నది నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మనకి అందుబాటులో ఏ బ్యాంకులు ఉన్నాయో చూడాలి. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో వివిధ డిపాజిట్లపై లభించే వడ్డీ రేట్లను ముందుగా పరిశీలించాలి. 60 ఏళ్లు అంతకు మించి వయసు ఉన్నవారికి బ్యాంకులు 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకూ అధిక వడ్డీని ఇస్తున్నాయి.

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి ఇలా?
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి), రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డి) ఈ రెండు డిపాజిట్లు కూడా పెట్టుబడులకు రక్షణ కల్పించి స్థిరమైన రాబడులను కస్టమర్లకు అందిస్తాయి. లిక్విడిటీ అవకాశాలు ఈ రెండిట్లోనూ సమానంగా ఉంటాయి. ఈ డిపాజిట్లపై రుణం తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ కంటే ముందే కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి ఇలా?
రాబడుల పరంగా చూస్తే రెండు డిపాజిట్లు పోల్చితే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మొదటి స్ధానం లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మొత్తం డబ్బుని ఒకేసారి డిపాజిట్ చేస్తాం. అందుకే మొదటి నెల నుంచి వచ్చే వడ్డీ గరిష్ట స్ధాయిలో ఉంటుంది. ఇక రికరింగ్ డిపాజిట్లు అంటే నెల నెల కొంత డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. వడ్డీలో తేడాలుంటాయి. నెల నెల వచ్చే వడ్డీలో కూడా మారుతుంటుంది.

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి ఇలా?
ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి జత చేరడంతో రాబడులు ఎక్కువగా ఉంటాయి. ఇక రికరింగ్ డిపాటిట్ పెట్టుబడులపై పెట్టుబడిదారుడు చక్రవడ్డీని పూర్తిస్దాయిలో పొందలేడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
షార్ట్ టర్మ్ డిపాజిట్లు: ఏడు రోజుల నుంచి ఆరు నెలల్లోపు కాలానికి జమ చేసిన మొత్తాలని షార్ట్ టర్మ్ డిపాజిట్లు అంటారు.
స్పెషల్ టర్మ్ డిపాజిట్లు: ఆరు నెలల నుంచి పదేళ్ల కాల పరిమితి వరకూ చేసిన డిపాజిట్లను స్పెషల్ టర్మ్ డిపాజిట్లు అంటారు. మూడు నెలలకొకసారి వీటిపై చక్రవడ్డీ చెల్లిస్తారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు: మనం డిపాజిట్ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీని నెలకొసారి లేదా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి కానీ తీసుకునే వీలున్న డిపాజిట్లివి.
రికరింగ్ డిపాజిట్లు: ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ ఎంతో ఉత్తమం. వీటిలో కూడా ప్రతి మూడు నెలలకు చక్రవడ్డీని ఇస్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications