ఇటీవల కాలంలో తరచూ పోలీసులు దొంగనోట్ల ముఠాను గుట్టు రట్టు చేశారంటూ వస్తున్న వార్తలను మనం చాలానే చూశాం. అంతేకాదు భారత్‌లో దొంగనోట్లను ముద్రించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. దీంతో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది.
ముఖ్యంగా 500, 1000 రూపాయల దొంగ నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. బ్యాంకులో మీరు నగదు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మీ నోట్లు సరైనవా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరువకూడదు. ఈ నేపథ్యంలో దొంగనోట్లకు అసలు నోట్లకు మధ్య ఉన్న తేడా ఎంటో చూద్దాం.

1. రిజిస్టర్
రూ. 500 నోటుపై పైన పేర్కొనబడిన వాటర్ మార్క్‌ని ముందుగా మీరు గమనించాల్సి ఉంది. లైట్ వెలుతురులో మీరు చూసినట్లైతే అక్కడ మీకు రూ. 500 నెంబర్ కనిపిస్తుంది.
2. వాటర్ మార్క్
లైట్ వెలుతురులో మీరు పైన పేర్కొనబడిన ఖాళీ ప్రదేశంలో చూసినట్లైతే అక్కడ దాగి ఉన్న మహాత్మాగాంధీ బొమ్మ కనిపిస్తుంది. అంతేకాదు అక్కడ ఎలక్ట్రోటైప్ రూపంలో 500 నెంబర్ కూడా కనిపిస్తుంది.
3. ఇంక్ మార్క్
మీ రూ. 500 నోటుని ఒక యాంగిల్‌లో పెట్టి చూసినట్లైతే పైన కనిపిస్తున్న గ్రీన్ కలర్ 500 నెంబర్ బ్లూ ఇంక్‌లో కనిపిస్తుంది.
4. కాంతిలో
500 నోట్ కింది భాగాన ముద్రించబడిన నోట్ నెంబర్ అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు మెరుస్తుంది.
5. ఆర్‌బీఐ భద్రతా తీగ
నోట్ మధ్య భాగంలో ఉన్న భద్రతా దారంలో భారత్, ఆర్‌బీఐ అని ఉంటుంది. ఒక యాంగిల్‌లో నోటుని పెట్టి చూసినప్పుడు అది ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.
6. ఆర్‌బీఐ సీల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రతో పాటు 'Paanch sau rupiye' అని సిరాతో ముద్రించబడి ఉంటుంది.
7. గుప్త చిత్రం
రూ. 500 నోటుకు కుడివైపున అంటే గాంధీ చిత్రం వెనుక భాగాన కంటితో దగ్గరగా పరిశీలిస్తే 500 నెంబర్ కనిపిస్తుంది.
8. చిన్న చిన్న అక్షరాలు
మహాత్మా గాంధీ చిత్రం, నిలువుగా ఉన్న గీతకు మధ్య ఆర్‌బీఐ, 500 నెంబర్ ఉంటుంది.
9. గుర్తు
రూ. 500 నోటును చూడగానే గుర్తించేందుకు ఎడమైవైపు భాగాన ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్‌ను చేతితో తాకవచ్చు.
10. ఏ సంవత్సరంలో ముద్రించబడింది
మీ దగ్గర ఉన్న నోటు ఏ సంవత్సరంలో ముద్రించబడిందో కూడా తెలిసిపోతుంది.
11. రిజిస్టర్
ఎడమవైపున ఏ విధంగానైతే డిజైన్ ఉంటుందో కుడి వైపున కూడా అదే విధంగా డిజైన్ ఉంటుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications