బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విసృత పరచాలనే ఉద్దేశ్యంతో 11 కార్పొరేట్ సంస్థలకు చెల్లింపు బ్యాంక్ లైసెన్స్‌కు ఆర్‌బీఐ సూత్రప్రాయమైన ఆమోదం ప్రకటించింది.
ఇలా అనుమతులు పొందిన కంపెనీల్లో కార్పొరేట్ దిగ్గజాలు ముకేష్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఇండ స్ర్టీస్, కుమార మంగళం బిర్లా నాయకత్వంలోని ఆదిత్య బిర్లా నువో, ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని టెక్ మహీంద్రాతో పాటు దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ ఉన్న తపాలా శాఖ కూడా ఉంది.
ఈ పేమెంట్ బ్యాంకులతో గ్రామీణులకూ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కొందరు భావిస్తుండగా, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు వస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

పేమెంట్ బ్యాంకుల పనితీరు ఇలా ఉంటుంది?
పేమెంట్ బ్యాంకులు రుణాలివ్వడం మినహా బ్యాంకులు చేసే అన్ని పనులూ చేస్తాయి. వీటిద్వారా అన్ని బిల్లులూ చెల్లించొచ్చు. ఇవి రూ. లక్ష లోపు విలువైన డిపాజిట్లు స్వీకరించటంతో పాటు డెబిట్/ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లనూ జారీ చేస్తాయి. కాకపోతే ఈ డిపాజిట్లపై సేవింగ్ ఖాతాపై ఎంత వడ్డీ ఇస్తాయో అదే ఇవ్వాలి. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా పేమెంట్ బ్యాంకులు దీన్ని పెంచే అవకాశం ఉంది. కరెంటు, టెలిఫోన్, మున్సిపాల్టీ, క్రెడిట్‌కార్డు వంటి ఇతర బిల్లులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్నీ ఇవి కల్పిస్తాయి.

మామూలు బ్యాంకులు ఇదే పని చేస్తున్నాయి కదా?
ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపుల దగ్గర నుంచి నగదు బదిలీ వరకు అన్ని సేవలనూ అందిస్తున్నపుడు ఈ కొత్త పేమెంట్ బ్యాంకుల వల్ల లాభం ఏంటన్నది ప్రశ్న. ఈ లావాదేవీలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆర్‌బీఐ భావిస్తోంది. చాలా వాణిజ్య బ్యాంకుల్లో ఈ సేవలు పొందాలంటే మీ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వ సగటున రూ. 25,000 వరకు ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంది. అదే పేమెంట్ బ్యాం కులు విషయానికొస్తే మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉండదు.

వ్యతిరేకత
బ్యాంకులు నమోదు చేస్తున్న లాభాల్లో కీలక పాత్ర చౌక వడ్డీరేటున్న కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లదే. చాలామంది ఖాతాదారులు నెలవారీ చెల్లింపుల కోసం సేవింగ్స్ ఖాతాల్లో భారీ మొత్తాన్ని ఉంచుతారు. కానీ ఇప్పుడు పేమెంట్ బ్యాంక్‌లు వస్తే కాసా డిపాజిట్లపై ఒత్తిడి పెరుగుతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అలాగే చాలా బ్యాంకులు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులపై ఫీజుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ బ్యాంకులు వస్తే పోటీ పెరిగి ఇటువంటి ఇతర ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పేమెంట్ బ్యాంకుల వల్ల ప్రయోజనాలు
* ఇవి సాధారణ బ్యాంకలతో పోలిస్తే పూర్తిగా భిన్నం. * చిన్న మొత్తాల్లో డిమాండ్ డిపాజిట్ల సమీకరణ, చెల్లింపు సేవలు అందిస్తాయి. * మొదట్లో ఈ బ్యాంకులు లక్ష రూపాయల వరకు డిమాండ్ డిపాజిట్లు సేకరించవచ్చు. * రుణాలు మంజూరు చేసే అర్హత లేదు. * ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు బదిలీ, ఎటిఎం/డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు జారీ చేయవచ్చు. * క్రెడిట్ కార్డులు జారీ చేసే అర్హత లేదు. * ఇలాంటి బ్యాంకుల్లో ప్రవాస భారతీయులు ఖాతాలు తెరవకూడదు. * మ్యూచువల్ ఫండ్‌లు, బీమా ఉత్పత్తులు కూడా విక్రయించవచ్చు. * ఒక్కో కస్టమర్ ఖాతాలో గరిష్ఠంగా లక్ష రూపాయలకు మించి నిల్వను అనుమతించరు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications