ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజాలైన ప్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వచ్చిన తర్వాత తరచుగా వినిపిస్తున్న మాట ఈ వాలెట్. అసలు వాలెట్ అంటే ఏమిటి? గురించి తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంకు ఖాతాలో నగదు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు తీసుకోవచ్చు.
అదే విధంగా ఆన్‌లైన్‌లో ఖాతా ఉంటే ఆ నగదుతో ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించవచ్చు. సరిగ్గా ఈ వాలెట్ లేదా డిజిటల్ వాలెట్‌లు ఇలాంటివే. ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుని, ఆన్‌లైన్ లావాదేవీలకు ఆ నగదుని వాడుకోవచ్చు.
ఈ వాలెట్‌లో నగదుని మొబైల్ ద్వారా వినియోగిస్తే దాన్ని మొబైల్ వాలెట్‌గా వ్వవహరిస్తారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యాలెట్ ముడు రకాలు. అవేంటంటే క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్, ఓపెన్.

ఈ వాలెట్ అంటే ఏమిటి, లాభమా, నష్టమా?
క్లోజ్డ్ వాలెట్ అంటే ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలైన బిగ్ బాస్కెట్, ఓలా, ప్లిప్‌కార్ట్, ఉబెర్, స్నాప్‌డీల్ లాంటి సంస్ధలు అందించేవి. దీని అర్ధం ఏమిటంటే వినియోగదారులు ఆయా వెబ్‌సైట్ ఖాతాదారులే నగదువేసుకుని, ఆయా వెబ్‌సైట్లలో జరిపే లావాదేవీలకే వినియోగించాలి. వేరే లావాదేవీలకు ఉపయోగించడం కానీ, ఒకసారి వేసిన డబ్బును వెనక్కి తీసుకోవడం కుదరదు. ఈ క్లోజ్డ్ వాలెట్‌లు పూర్తిగా ఆయా కంపెనీల నియంత్రణలో ఉంటాయి.

ఈ వాలెట్ అంటే ఏమిటి, లాభమా, నష్టమా?
సెమీ క్లోజ్డ్ అంటే ఈ వాలెట్లలో నగదు డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇతర ఆన్‌లైన్‌లో కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో సదరు వాలెట్‌ను నిర్వహిస్తున్న ఏఏ కంపెనీలతో ఒప్పందాలున్నాయో ఆ కంపెనీలు మాత్రమే ఈ వాలెట్లను అనుమతిస్తాయి. వాటితో మాత్రమే జరిపే చెల్లింపులు చేసే అవకాశం ఉంది. మెబిక్విక్, పేయు, పేటీఎం, సిట్రస్ క్యాష్ లాంటి వెబ్‌సైట్లు ఇలాంటివే.

ఓపెన్ వాలెట్
ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా ఓపెన్ వాలెట్లను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇందులో నగదు జమ చేయడం, విత్‌డ్రా చేయడం సహా బిల్లుల చెల్లింపు, ఈ కామర్స్ లావాదేవీలు ఏవైనా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న నగదుని ఏటీఎంల ద్వారా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వాలెట్లను బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వాడాపోన్ సంస్ధ ఎంపైసాను ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి దీనిని అందిస్తోంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వాలెట్లలో నగదు నిల్వ రూ. 50 వేలకు మంచికూడదు.

వాలెట్ ద్వారా లాభం
భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా వాలెట్ మంచేదనని చెబుతున్నారు నిపుణులు. ఈ కామార్స్ దిగ్గజ వెబ్‌సైట్లు వినియోగదారులను ఆకర్షించే భాగంలో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వాలెట్ నగదుతో తక్కువ ధరకే మంచి ఉత్పత్తులను మీ సొంతం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications