డబ్బు విలువ గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైన అవగాహాన కల్పించడం భవిష్యత్తులో వారి ఆర్ధిక ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్నారులు డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా, బయట షాపింగ్ వెళ్లినప్పుడు ఆర్ధిక లావాదేవీల్లో వేలు పెడుతుంటారు.
అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. బ్యాంకులు కూడా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఉచితంగా పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయలతో కూడిన కిడ్స్ ఖాతాలను ఇస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేక ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు అందుబాటులో ఉన్న బ్యాంకు ఖాతాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎస్‌బీఐ పెహ్లా కదమ్ పెహ్లీ ఉడాన్
ఎస్‌బీఐ రెండు రకాల ఖాతాలను అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలిసి ఏ వయసు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లా ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీనిని పిల్లలే సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్‌బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీవల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాటేజ్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ ఖాతాను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా డెబిట్ కార్డును ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ. 2,500 విత్ డ్రా చేసుకోవచ్చు. షాపింగ్‌కు కూడా రూ. 2,500 పరిమితి ఉంది. ఈ ఖాతాకు రూ. 1,00,000 వరకు విద్యా బీమా కవరేజి ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటు మూడు నెలలకొసారి ఖాతా స్టేట్ మెంట్, లావాదేవీలకు సంబంధించిన ఉచిత మెయిల్ అలర్ట్‌లు కూడా బ్యాంకు పంపిస్తుంది.

ఐసీఐసీఐ యంగ్ స్టార్స్
ఒక్క రోజు నుంచి 18 ఏళ్ల దాకా వయసు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు కోరితే 7ఏళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది. రోజువారీ నగదు విత్ డ్రా కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పరిమితులను ఎంచుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ ప్యూచర్ స్టార్స్ ఖాతా
18 ఏళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకసారి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్‌బుక్‌లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా, రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. 10 ఏళ్లు పైబడిన పిల్లలు వారు కోరిని చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. 6 నెలలకు ఒకసారి డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజి ఉంది.

కోటక్ మై జూనియర్ అకౌంట్
ఈ ఖాతాపై కోటక్ మహీంద్రా బ్యాంక్ సంవత్సరానికి 6 శాతం వడ్డీని ఇస్తోంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది.

కరూర్ వైశ్యా జంబో కిడ్స్ సేవింగ్స్
కరూర్ వైశ్యా బ్యాంక్ 12ఏళ్ల దాకా వయసు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన పని లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్‌ను కూడా బ్యాంకు ఇస్తుంది. ఇక స్టూడెంట్ సేవింగ్స్ అకౌంట్ పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయసు గల విద్యార్ధుల కోసం మరో సేవింగ్స్ ఖాతాను కూడా బ్యాంకు అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ. 250గా ఉండాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications