ఏజెంట్ల నోట మనం మనీ బ్యాక్ పాలసీ అంటూ వింటూ ఉంటాం. అసలు మనీ బ్యాక్ పాలసీ అంటే ఏమిటి? వాటి గురించి తెలుసుకుందాం. ఇవి తేలికపాటి బీమా పాలసీ. పాలసీదారులు ఎలాంటి విపత్తు నుంచైనా కుటుంబానికి రక్షణ కల్పిస్తూనే నిర్దిష్ట కాలపరిమితిలో కొంత శాతం వంతున సోమ్ము అందుకుంటారు.
పాలసీదారుల జీవనయానంలో ఎదురయ్యే ఇంటి కొనుగోలు, పిల్లల విద్య, ప్రపంచంలోని సుందర ప్రదేశాల సందర్శన వంటి భిన్న లక్ష్యాలకు అవసరమైన సొమ్మును ఆయా సమయాల్లో అందిస్తూ ఉండడమే ఈ పాలసీ ప్రత్యేక లక్షణం. ఈ పాలసీలో పెట్టుబడి అనేది భవిష్యత్తుకు భరోసానిస్తుంది.
పాలసీలో హామీలో మొత్తంలో నిర్దేశిత శాతంలో సొమ్మును అందిస్తూ ఉండటంతో పాటు పాలసీ కాలపరిమితి ముగిసే సమయానికి మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా పాలసీదారు అందుకుంటారు. వీటిల్లో చాలా రకాలున్నాయి. సాంప్రదాయ టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్, మార్కెట్ ఆధారిత రాబడులందించే యులిప్ పాలసీలు.

క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రత్యేకలు
నిర్దిష్ట కాలపరిమితిలో క్రమం తప్పని రాబడులు అందిస్తూ బీమాదారుల ఆర్థిక లక్ష్యాలకు చేయూత అందించడం. పరిమిత కాలంలో చెల్లింపులు చేస్తూ దీర్ఘకాలానికి పెట్టుబడి ప్రయోజనాలు అందించడం. చెల్లిస్తున్న ప్రీమియంలు, అందుకుంటున్న ప్రయోజనాలు అన్నింటికీ పన్ను రాయితీలు అందించడం.

క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రధాన లక్షణం
పరిమిత కాల చెల్లింపులకే ప్లాన్ అమలు కోసం ఎంచుకున్న కాలపరిమితి మొత్తంలో నిర్దిష్ట విరామాల్లో కొంత సొమ్ము పాలసీదారులకు అందిస్తూ ఉండడం క్యాష్ బ్యాక్ ప్లాన్ల ప్రధాన లక్షణం. అంటే పాలసీదారుని సంపాదన సమయంలో ప్రీమియంల చెల్లింపునకు అవకాశం కల్పిస్తూ పాలసీ అమలులో ఉండే కాలపరిమితి అంతటా చెల్లింపులను విస్తరిస్తాయి.

అవసరాలకు పనికొస్తాయా?
ప్రతీ ఒక్కరికీ జీవితంలో చిన్నవి లేదా పెద్దవి లక్ష్యాలు కొన్ని ఉంటాయి. పాలసీదారుని వయసు, కుటుంబ ఆర్థిక స్థితి, భవిష్యత్ ఆధారంగా జీవితంలో కొన్ని మైలురాళ్లను నిర్దేశించుకుంటారు. జీవితంలో దీర్ఘకాలిక ప్రణాళికలతోపాటు స్వల్పకాలక ప్రణాళికలు కూడా ఎంతో ముఖ్యం. ఈ ప్రణాళికలకు మనకి ఆయా సమయాల్లో డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో క్యాష్ బ్యాక్ ప్లాన్స్ ఉపయోగపడతాయి.

పన్ను మినహాయింపు ఉంటుందా?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాష్ బ్యాక్ ప్లాన్స్ ఎక్కువగా ఆదాయపు పన్ను చట్టం 1961 పరిధిలోకి వస్తాయి గనుక సెక్షన్ 80 (సి) కింద ఈ పాలసీలపై చెల్లించే ప్రీమియంకు ఏడాదికి లక్షన్నర రూపాయల వరకు నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ ప్రయోజనాలపై కూడా పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications