రూపాయి నోటు ప్రింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇది గనుక తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రూపాయి విలువ కంటే దాని ప్రింటింగ్ ఖర్చే ఎక్కువ అవుతోంది.
భారత ప్రభుత్వం కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న రూపాయి నోటు ముద్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 1.14 పైసలను ఖర్చుపెడుతోంది. ఈ రూపాయి నోట్లు ప్రింటింగ్ రాజస్ధాన్‌లోని నాథ్‌ద్వారాలో జరుగుతోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ప్రశ్నకు అర్‌బీఐ చెప్పిన సమాధానం ఇది. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి నోట్లను మళ్లీ చెలామణిలోకి తెస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొత్త రూపాయి నోటుని వందశాతం కాటన్ రాగితో తయారు చేస్తున్నారు. దీని బరువు 900 గ్రాములు. మందం 100 మైక్రాన్స్. సత్యమేవ జయతే పదాలు లేకుండా అశోక స్ధూపాన్ని నోటుపై ముద్రించారు. నోటుకు కుడి భాగంలో 'భారత్' అని హిందీలో ముద్రించింది.
ఈ కొత్త రూపాయి నోటుపై ఆర్ధిక సెక్రటరీ సంతకం ఉంటుంది. భారత్‌లో మిగతా నోట్లను ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications