నగదు లావాదేవీల కోసం బ్యాంకు అకౌంట్ తరహాలోనే స్టాక్ మార్కెట్‌లోని షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగించే అకౌంట్ డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. భారత్‌లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ లాంటి బ్రోకరేజ్ సంస్ధలు డీమ్యాట్ అకౌంట్లను అందిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించాలంటే డీమ్యాట్ అకౌంట్ ఎంతో కీలకం. స్టాక్ మార్కెట్‌లో షేర్లు అమ్మడం, కొనడం నగదుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాచ్ అకౌంట్ అవసరం.

షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా
ఆన్‌లైన్‌లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసినటువంటి షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచేందుకు గాను డీమ్యాట్ అకౌంట్ అవసరం. భారత్‌లో బ్యాంకింగ్, బ్రోకరేజ్ సేవలు అందించే సంస్ధలు ఈ మూడింటిని త్రీ ఇన్ వన్ అకౌంట్‌గా కూడా అందిస్తున్నాయి.

విడిగా డీమ్యాచ్ అకౌంట్
కొన్ని బ్రోకరేజ్ సంస్ధలు ప్రత్యేకించి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఇస్తున్నాయి. ఈ సందర్భంలో బ్యాంక్ అకౌంట్ తీసుకుని, దానిని వీటికి అనుసంధానం చేసుకోవాలి.

డీమ్యాట్ అకౌంట్‌లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
షేరు అమ్మినా, కొనుగోలు చేసిన ప్రతిసారి బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ బ్రోకరేజి ఛార్జీ ఫిక్స్‌గా ఉంటుంది లేదంటే మీరు నిర్వహించిన లావాదేవిలో ఇంత శాతమని ఉంటుంది. ఉదాహరణకు బ్రోకరేజి ఛార్జి 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

డీమ్యాట్ అకౌంట్‌కు వార్షిక చార్జీలు వసూలు
బ్రోకరేజి సంస్ధలు అందించిన సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 వరకు ఛార్జిని వసూలు చేస్తుంటాయి. వీటితో పాటు డీమ్యాచ్ ఛార్జీలు (షేర్లను పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), సలహా ఫీజులు, ట్రేడింగ్ ఫీజులని వినియోగాన్ని బట్టి వసూలు చేస్తుంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications