విదేశాలకు మనీ ట్రాన్ఫర్: వివిధ మార్గాలు?
భారతదేశ ముఖచిత్రాన్ని ఐటీ రంగం ఎంతగానో మార్చివేసింది. ఇటీవల కాలంలో ఉద్యోగం కోసమో లేదా చదువుకొనేందుకు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగం చేసి ఆర్జించిన నగదుని ఇక్కడకు పంపిచేందుకు లేదా ఇక్కడ నుంచి విదేశాలకు డబ్బు పంపేందుకు గాను 'మనీ ట్రాన్ఫర్' ఎంతో కీలకం.
ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో ఉన్న వారే విదేశాలకు వెళ్లేవారు. ఐటీ రంగం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారి సంఖ్య మరింతగా పెరిగింది. దాంతో అక్కడ ఆర్జించిన మొత్తంలో కొంత భాగాన్ని తమ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడికి పంపిస్తుంటారు.
విదేశాల నుంచి వచ్చే నగదును తేలికగా అందుకోవడానికి అనేక మార్గాలున్నాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత మనీ ట్రాన్ఫర్ చేసే సంస్ధలు కొత్త కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అసలు విదేశాల నుంచి వచ్చే నగదుని మన రూపాయల్లోకి మార్చుకోవడానికి ఉన్న మార్గాలేంటో ఒక్కసారి చూద్దాం.

బ్యాంకులు
మన దేశంలో ఉన్న చాలా బ్యాంకులు మనీ ట్రాన్ఫర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ పద్ధతిలో నగదు పంపే వ్యక్తి బ్యాంకుకు వెళ్లి నగదును ఖాతాలో జమ చేయాలి. నగదు తీసుకునే వ్యక్తి తనకు దగ్గర్లో ఉన్న సంబంధిత బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవచ్చు.

ఐఎంటీఓ
బ్యాంకుల ద్వారా నగదు పంపడంతో కొన్ని ఇబ్బందులు ఉండటంతో చాలా మంది ఇప్పుడు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. లావాదేవీలు నిర్వహించడంలో సౌలభ్యం, సేవలు పొందడంలో ఇబ్బంది లేకపోవడంతో వీటికి ఎక్కువ ఆదరణ పెరుగుతోంది.

ఐఎంటీఓ
ప్రపంచంలో ఎక్కడున్నా సరే దగ్గర్లోని ఐఎంటీఓకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నగదుని జమ చేయాలి. నగదుని తీసుకునే వ్యక్తి కూడా తన దగ్గర్లో ఉన్న ఐఎంటీఓ ఏజెంట్ వద్దకు వెళ్లి పత్రాలు చూపించి, డబ్బు తీసుకోవచ్చు.

ఆన్‌లైన్లో
కొన్ని సందర్భాల్లో డైరెక్టుగా ఐఎంటీఓ ఏజెంట్ వద్దకు వెళ్లేందుకు కుదరకపోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ మనీ ట్రాన్ఫర్ విధానం కూడా అమల్లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications