మనలో చాలా మంది... ఒకటికి మంచి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నాం. ఇటీవల కాలంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల సంఖ్య ఉన్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఇలా ఒకటికి మంచి బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటం మంచిదేనా అంటే, మంచిది కాదని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వ్యక్తికి రెండు నుంచి ఐదు వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అనుకోండి. అయితే, వీటిలో అన్నింటినీ వాడుతున్నారా అంటే? సమాధానం మాత్రం వెంటనే చెప్పడం లేదు. జీతం పడే ఖాతాతో పాటు, ఆన్‌లైన్, మొబైల్ బ్యాకింగ్ సౌకర్యాలను పూర్తి స్థాయిలో అందిస్తున్న బ్యాంకు ఖాతాలను మాత్రమే విరివిగా ఉపయోగిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.
మరికొంత మంది అయితే తమకు ఫలానా బ్యాంకు ఖాతా ఉన్న విషయాన్నే మరిచిపోయామంటున్నారు. ఇలా ఉపయోగం లేని ఖాతాల వల్ల మున్ముందు సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, ముందే వాటిని గుర్తించి రద్దు చేసుకోవడమే మంచిది.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్
సాధారణంగా కార్పోరేట్ ఉద్యోగ సంస్ధలు అందించే అకౌంట్లలో నిల్వ ఉంచక్కర్లేదు. సాధారణంగా వేతనం ఖాతాలు సున్నా నిల్వతో లభిస్తాయి. ఆయా సంస్థలు, బ్యాంకులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బ్యాంకులు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్
ఇది ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలానికే వర్తిస్తుంది. ఒకసారి మీరు అక్కడ ఉద్యోగం మానేశారనుకోండి. వెంటనే ఆ ఖాతాను కూడా రద్దు చేసుకోండి. లేకపోతే మూడు నెలల తర్వాత ఆ ఖాతాను సాధారణ ఖాతాగా పరిగణిస్తారు. అప్పుడు మీరు కనీస నిల్వ ఉంచాల్సి వస్తుంది.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్
ఒకవేళ మీరు ఆ ఖాతాను పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. నిర్ణీత సమయం తర్వాత పైన్ విధిస్తారు. కొంతకాలం తర్వాత ఇవి పెద్ద మొత్తం అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు ఖాతా రద్దు చేసుకోవాలంటే ఈ మొత్తం అంతా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్
వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి. లేదా అన్నింట్లోనూ కనీస నిల్వ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అపరాధ రుసుములు విధిస్తే.. అది మీ క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఉపయోగించని ఖాతాలకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని రద్దు చేయడం మంచిది.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్
మీ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చూసుకోవడం మంచిది. అవసరాలను బట్టి, ఖాతాలను తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, వీలైనంత వరకూ వేతన ఖాతాకు తోడుగా మరో ఖాతాను తీసుకోవడం ఎప్పటికైనా మంచిదే.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications