విదేశీ పర్యటన: ఎంత డబ్బు మీ వెంట తీసుకెళ్లొచ్చు..?
విదేశీ పర్యటన కోసం అమెరికాకు వెళ్లినప్పుడు ఎంత మొత్తంలో అమెరికన్ డాలర్లు భారత్ నుంచి తీసుకుని వెళ్లొచ్చనే తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ సమాచారాన్ని ప్రత్యేకించి అందిస్తున్నాం. వ్యక్తిగత పర్యటనల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు ఎంత మొత్తంలో నగదు తీసుకెళ్లాలనే దానిపై ఆర్‌బీఐ కొన్ని నిబంధలను ఖరారు చేసింది.
ప్రస్తుతం ఎవరైనా సరే వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్తున్నప్పుడు కేవలం 10,000 అమెరికన్ డాలర్ల వరకే అనుమతి ఉంది. ఉదాహరణకు మీరు జపాన్ లేదా యూరప్ దేశాలకు పర్యటనకు వెళ్లారని అనుకుందాం. ఆయా దేశాల కరెన్సీకి సమానమైన 10,000 అమెరికన్ డాలర్ల వరకు మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ఈ 10,000 అమెరికన్ డాలర్లు కేవలం విదేశీ వ్యక్తిగత పర్యటనలకు మాత్రమే, బిజినెస్ పర్యటనలకు వేరుగా ఉంటుంది. అదే మీరు గనుక బిజనెస్ పర్యటనపై విదేశాలకు వెళ్లినట్లతే 25,000 డాలర్ల వరకు తీసుకెళ్లొచ్చు.

ఎందుకిలా?
విదేశీ పర్యటనలు బట్టి మీరు తీసుకెళ్లాల్సిన డబ్బు ఆధారపడి ఉంటుంది. ఉదహారణకు వ్యక్తిగత పర్యటన తీసుకుంటే మీరు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉండదు కాబట్టి కేవలం 10,000 డాలర్ల వరకు ఆర్‌బీఐ అనుమతించింది. అదే బిజినెస్ పర్యటన అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పరిధిని 25,000కు పెంచింది.
1. ప్రైవేట్ పర్యటనలు
ప్రైవేట్, వ్యక్తిగత పర్యటనలకు 10,000 డాలర్ల పరిమితిని విధించింది.
2. వైద్య కోసం విదేశాలకు వెళితే
విదేశాల్లో వైద్య చికిత్స కోసం 100000 అమెరికన్ డాలర్ల వరకు తీసుకెళ్లవచ్చు. ఎక్కడైతే మీరు చికిత్సను తీసుకుంటున్నారో ఆ ఆసుపత్రి వైద్యుల నుంచి డిక్లరేషన్ ఫామ్ జత చేయాల్సి ఉంటుంది.
3. చదువుకునేందుకు విదేశాలకు వెళ్లడం
విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల ఆయా విద్యా సంస్ధల ఫీజుని బట్టి 100000 అమెరికన్ డాలర్ల వరకు తీసుకెళ్లవచ్చు.
4. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం
విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లే వారు 100000 అమెరికన్ డాలర్ల వరకు తీసుకెళ్లవచ్చు. అయితే మీరు తీసుకెళ్లిన డాలర్ల క్యాలెండర్ సంవత్సరంపై ఆధారపడి నిబంధనలు ఉంటాయి.
ఇక భారత్ పొరుగుదేశాలైన నేపాల్, భూటాన్‌లను సంప్రదించే విదేశీయులు కరెన్సీ రూపంలో కేవలం 3000 అమెరికన్ డాలర్లు మాత్రమే తీసుకెళ్లాలి. ఇంకా మొత్తంలో కావాలంటే ట్రావెల్ చెక్‌ల రూపంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
విదేశీ కరెన్సీని ఎలా చెల్లించాలి?
విదేశీ కరెన్సీని నగదు రూపంలో చెల్లించాలి. ఒకవేళ మీరు చెల్లించే విదేశీ కరెన్సీ రూ.50,000కు మించినట్లేతే చెక్కుల రూపంలో చెల్లించాలి.


Click it and Unblock the Notifications