ఏటీఎం మెషిన్‌లో కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?
ఏటీఎమ్ మిషన్‌లో నగదు లావాదేవీలు నిర్వహించేటప్పుడు ముందుగా డెబిట్ కార్డుని స్వైప్ చేసి, ఆ తర్వాత లావాదేవి నిర్వహిస్తాం. మనకు ఎంత నగదు కావాలో అంత డబ్బుని మిషన్ నుంచి తీసుకుంటాం. ఇదొక సందర్భం.
అయితే కొన్ని బ్యాంకుల మెషిన్లు మాత్రం లావాదేవీ పూర్తైన తర్వాతే ఏటీఎం నుంచి కార్డు బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భంలో లావాదేవీ నిర్వహిస్తున్న సమయంలో కార్డు అందులో ఇరుక్కు పోయే ప్రమాదం ఉంటుంది.
అసలు ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఎందుకు ఇరుక్కుపోతుంది. ఏటీఎం మిషన్ ఉన్న గదిలో పవర్ సమస్య వచ్చినా లేక పిన్ నెంబర్‌ను 3 సార్లు తప్పుగా టైప్ చేసినా కార్డు అందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.
అంతేకాదు ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఉంచిన తర్వాత మీ లావాదేవీ చాలా త్వరగా పూర్తి చేయాలి. అలా చేయకుండా లావా దేవీ నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకున్నా మీ డెబిట్ కార్డు ఏటీఎం మిషన్‌లో ఇరుక్కు పోయే అవకాశం ఉంటుంది.
ఏటీఎం మెషిన్‌లో కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?

ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?
* ముందుగా కస్టమరే కేర్‌కి ఫోన్ చేయాలి లేదా తక్షణమే మీ బ్యాంకును సంప్రదించాలి. డెబిట్ కార్డుని సరిగ్గా ఉపయోగించకుంటే బ్లాక్ చేసే అధికారం బ్యాంకులకు ఉంది కాబట్టి.
* ఎప్పుడైతే మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందో వెంటనే ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కార్డు కోసం నమోదు చేసుకోండి.

ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?
* ఎక్కడైతే మీ బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు వెళ్లి ఐడీ ప్రూఫ్‌తో కొత్త కార్డు కోసం నమోదు చేసుకోండి.
* మీరు ఉపయోగించిన ఏటీఎం మెషిన్, మీరు ఖాతా కలిగిన ఉన్న బ్యాంకుదే అయితే మీరు తిరిగి అదే కార్డుని పొందగలరు.

ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?
* ఉదాహరణకు మీరు గనుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమరైతే, మీరు ఉపయోగించిన ఏటీఎం కూడా హెచ్‌డీఎఫ్‌సీదే అయితే తిరిగి అదే కార్డుని పొందగలరు.

ఏటీఎం మెషిన్‌లో డెబిట్ కార్డు ఇరుక్కుపోతే ఏం చేయాలి?
* మీరు గనుక కొత్త కార్డుని పొందినట్లైతే, పిన్ నెంబర్‌ను మీ అడ్రస్‌కు పంపిస్తారు.
* కొత్త కార్డుని కస్టమర్‌కు ఇచ్చేందుకు గాను కొన్ని బ్యాంకులు రుసుముని కూడా వసూలు చేస్తాయి(రుసుము అనేది బ్యాంకు బట్టి ఉంటుంది).


Click it and Unblock the Notifications