ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందడం ఎలా?
ఆర్ధిక లావాదేవీలు నిర్వహించాలంటే మనదేశంలో పాన్ కార్డు తప్పనిసరి. అలాంటి పాన్ కార్డు పొందడం ఎలానో తెలుసుకుందాం. సాధారణంగా కొత్త పాన్ కార్డు కోసం కింద పేర్కొన్న వెబ్‌సైట్ లేదా పాన్ కార్డ్ సేవలందించే ఇతర వెబ్‌సైట్లు ప్రత్యేకమైన దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి.
కొత్త పాన్ కార్డు ఫారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాన్ కార్డు ఫారం నింపేందుకు పూర్తి గైడ్‌లెన్స్
అడ్రస్ మారినా, పాన్ కార్డు పోయినా లేదా పాన్ కార్డుపై ఫోటోను మార్చాలన్నా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. పైన పేర్కొన్న లింక్ ద్వారా ఫారం 49Aని డౌన్ చేసుకోని ఫోటోతో సహా అన్ని వివరాలను నింపాల్సి ఉంది. అనంతరం కొత్త పాన్ కార్డ్ జారీ కోసం 93 రూపాయల పైన సర్వీసు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

అదే గనుక పాన్ కార్డ్ చేరాల్సి అడ్రస్ విదేశం అయితే, రూ. 971 రూపాయల ఫీజు చెల్లించాలి. మనదేశంలో పౌరుడు ఒక పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో అతను శిక్షకు అర్హుడు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, వాటి రద్దు కోసం ఆ ఇతర పాన్‌నెంబర్లను ఆ ఫారంలో తప్పకుండా రాయాలి.
అదే వివరాలను మార్చాల్సిన పని లేకుండా, పోయిన పాన్ కార్డు స్ధానంలో కొత్త పాన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే ఫోటోగ్రాఫ్‌ను మాత్రం జత చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో పాత పాన్ కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకు కొత్త పాన్ కార్డు జారీ చేస్తారు.


Click it and Unblock the Notifications