సాధారణంగా బిజినెస్ వార్తల్లో తరచుగా మనం 'లిక్విడిటీ' అనే మాటలు వింటూ ఉంటాం. అసలు లిక్విడిటీ అంటే ఏమిటి? వివిధ ఆస్తులకు ఎంత లిక్విడిటీ ఉందన్న విషయాన్ని ఎలా కొనుగోలుదారులు గుర్తిస్తారో చూద్దాం.
లిక్విడిటీ అంటే ఏమిటి?
ఏదైనా ఆస్తి తన అసలు రేటుని పొగొట్టుకోకుండా సాధ్యమైనంత తక్కువ ధరను కోల్పోయి మారకంలోకి వెళ్లగల సామర్ధ్యాన్ని ఆ ఆస్తి యొక్క లిక్విడిటీ అంటారు. ఇక స్టార్ మార్కెట్ల విషయానికి వస్తే, అత్యున్నత స్ధాయిలో ట్రేడింగ్ అయ్యే షేరు సామర్ధ్యాన్ని లిక్విడిటీ అంటారు.

ఒక్కమాటలో చెప్పాలంటే తేలికగా డబ్బుగా మారడం ఒక్కటే కాదు. అలా మారే క్రమంలో ఆస్తి తన అసలు ధరను కోల్పోకుండా ఉంటేనే లిక్విడిటీ బాగా ఉన్నట్లు. డబ్బుగా మార్చుకోగల ప్రతి ఆస్తికీ లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఆస్తి త్వరగా అమ్ముడవుతుంది లేదా కొనుగోలుదారులు ఎక్కువ మంది ఉంటారు.
లిక్విడిటీలో ఒక తేడా ఉంటుంది. అదేమిటంటే ఎక్కువ లిక్విడిటీ ఉన్న ఆస్తులకు తక్కువ లాభాలు వస్తాయి. తక్కువ లిక్విడిటీ ఉన్న ఆస్తులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు నగదు అనేది అత్యధిక లిక్విడిటీ కలిగిన ఆస్తి.
రూ. 100కి రూ. 125కు ఆస్తి ఇమ్మంటే ఎవరూ ఇవ్వరు. తక్కువ ట్రేడ్ అయ్యే షేర్లను మార్కెట్ చెయ్యడంలో మదుపుదార్లు ఎక్కువ లాభం ఆశిస్తారు. ఎందుకంటే వాటిని మార్కెట్ చేయడానికి ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.
లిక్విడేషన్ అంటే ఏమిటి?
లిక్విడేషన్ అని మరో మాట వింటుంటాం. ఒక ఆస్తి సొంతదారు తన ఆస్తిని అమ్మేసి సొమ్ము చేసుకుంటే అతను తన ఆస్తిని ‘లిక్విడేట్' చేశాడు అని చెబుతారు. ఒక కంపెనీ తన వాటాల్లో (షేర్లలో) కొన్నింటిని మార్కెట్ లో అమ్ముకుని పెట్టుబడి సంపాదిస్తారు. ఈ ప్రక్రియను కూడా ‘లిక్విడేషన్' అంటారు.
రంగాన్ని బట్టి లిక్విడిటీ స్వాభావం మారుతూ ఉంటుంది. ప్యూచర్స్ మార్కెట్‌లో లిక్విడిటీకి గ్యారంటీ ఉండదు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో బాధ్యతను బట్టి తీర్చగల సామర్ధ్యం లిక్విడిటీగా ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లకు ప్రభుత్వ హామీ ఉంటే వాటి లిక్విడిటీ ఎక్కువగా ఉన్నట్లు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications