కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలైన పక్కాగృహాలు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డుతో పాటు నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి సైతం పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడంతో ఆధార్ కీలకంగా మారింది. అలాంటి ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడం ఎలా?
ముఖ్యంగా ఆధార్ నమోదు చేసిన ఫోన్ మారినా లేదా పుట్టిన తేదీ తప్పుగా నమోదయినా, సరిచేసుకోవాలంటే ఏం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. అయితే ఆధార్ కార్డులో కొన్నింటిని మాత్రమే మనం మార్పులు, చేర్పులు చేయగలం. అవేమిటంటే పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఫోటోను మార్చే అవకాశం మాత్రం లేదు.

ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే రెండు విధానాలున్నాయి. ముందుగా ఆన్‌లైన్ విధానంలో ఎలానో తెలుసుకుందాం.
* ఇంటర్‌నెట్‌లో లింక్‌ను క్లిక్ చేయాలి.
* మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి.
* దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి.
* అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది.
* ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి.
* ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది.
* ఈ ఫారమ్‌ను పూరించాక సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి.
* తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
* తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి.
* ఇప్పుడు మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది.
* ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.
* ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
* ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్‌ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి.
* 5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు.
* మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు.
* పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు. (ఉదా: డా, శ్రీ, శ్రీమతి...)
* అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్‌డేట్ అయిన ఆధార్‌ను ఆ అడ్రస్‌కు పంపుతారు.
* డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది.
* మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...)
ఇంటర్ నెట్‌లో లింక్‌ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది.
* అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి.
* దరఖాస్తును నిర్దేశిత కాలమ్‌లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి.
* ఒక ఎన్వలప్‌పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్‌డేట్ అండ్ కరెక్షన్' అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి.
* అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలకు ఒక్కటే.


Click it and Unblock the Notifications