బెంగుళూరు: షేర్ల కొనుగోలుకు అవసరమైన డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను మరింత సులభంగా ప్రారంభించే అవకాశం రిటైల్ ఇన్వెస్టర్లకు ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ (సెబీ) నిర్ణయం తీసుకుంది.
దీని కోసం దరఖాస్తు పత్రాలను సరళీకరించడంతో పాటు, నివాస ధ్రువీకరణ పత్రాల సమర్పణ ప్రక్రియను కూడా సులభతరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాలను విక్రయిస్తుండటంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఈక్విటీ మార్కెట్లకు ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.
ఇందు కోసం 'సరళ్ ట్రేడింగ్ అకౌంట్' ప్రక్రియకు సెబీ శ్రీకారం చుట్టింది. మార్కెట్‌కు కొత్తగా వచ్చే రిటైల్ ఇన్వెస్టర్లు నగదుతోనే షేర్ల కొనుగోలుకు దరఖాస్తు చేస్తుంటారు. వీరికి ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, పవర్ ఆఫ్ అటార్నీ ప్రక్రియను వినియోగించే అవసరం ఉండదు.

సరళ్ ఖాతా అంటే ఏమటి?
షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేపట్టేందుకు వీలుగా సరళీకరించిన ఖాతా ప్రారంభ పత్రమే 'సరళ్ ఆఫ్'. దీని పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని సరళ ఖాతా అంటారు. స్టాక్ ఎక్సేంజ్‌లు, బ్రోకరేజీ సంస్ధల వెబ్‌సైట్‌ల నుంచి కూడా ఈ పత్రాన్ని డౌన్ లౌడ్ చేసుకోవచ్చు.
సరళ్ ఖాతా ప్రారంభించాక, మరిన్ని సేవలు పొందాలంటే, కావాల్సిన అదనపు సమాచారాన్ని సమర్పించాల్సి ఉంది.
సరళ్ ట్రేడింగ్ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు?
* చిరునామా ధ్రువీకరణ కోసం నివాస/తపాలా చిరునామా/శాశ్వత చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుంది.
* ఒకవేళ ధ్రువీకరణ పత్రంలోని చిరునామాలో నివసించకపోతే, అతనికి ఏ చిరునామాలో లేఖలు, వివరాలు అందించాలో తెలిపే చిరునామా తీసుకోవాలి.
* ఇందుకు ధ్రువీకరణ ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఈ చిరునామా నుంచి మారితే, రెండు వారాల్లోపు తెలియపరచాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications