ఏటీఎమ్‌లో నగదు డిపాజిట్ చేయడం ఎలా...?
పూర్వపు రోజుల్లో నగదు డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఐతే ఇటీవల కాలంలో సాంకేతిక పెరిగిన నేపథ్యంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లకుండా ఏటీఎమ్ మెషిన్లలో నగదు డిపాటిట్ చేస్తున్నారు. కాబట్టి ఏటీఎమ్ మెషిన్లలో నగదు డిపాజిట్ చేయడం ఎలాగో తెలుకుందాం?
నగదుని డిపాజిట్ చేసే మిషన్లను క్యాష్ డిపాజిట్ మెషిన్లు లేదా ఆటోమెటెడ్ టెల్లర్ మెషిన్లు అంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా తర్వితగతిన నగదుని డిపాజిట్ చేసేందుకు ఈ క్యాష్ డిపాజిట్ మెషిన్లు బ్యాంకులు ప్రవేశపెట్టాయి.
సమయాన్ని వృధా చేసుకోకుండా నగదుని ఈ మెషిన్ల ద్వారా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు బ్యాంకులు ఎలాంటి రుసుముని వసూలు చేయవు. ఒక లావాదేవీకి గాను రూ. 49, 900 వరకు నగదుని డిపాజిట్ చేయవచ్చు.
ఒక లావాదేవీలో సుమారు 200 నోట్ల వరకు మెషిన్ ద్వారా జమ చేయవచ్చు. రూ. 1000, రూ. 500, రూ. 100 నోట్లను క్యాష్ డిపాజిట్ మెషిన్లలో నగదు రూపంలో డిపాజిట్ చేయవచ్చు. అన్ని బ్యాంకులు ప్రవేశపెట్టిన క్యాష్ డిపాజిట్ మెషిన్లు పైన పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్‌లో నగదు డిపాజిట్ చేయడం ఎలాగో చూద్దాం?
1. ఏటీఎమ్‌పై మీ ఎస్‌బీఐ కార్డుని స్వైప్ చేయండి
2. భాషను ఎంచుకోండి
3. పిన్ ఎంటర్ చేయండి
4. నగదు డిపాజిట్ ఎంచుకోండి
5. నిర్ధారించడంపై క్లిక్ చేయండి
6. ఏ రకం (పొదుపు లేదా ప్రస్తుత) ఖాతానో ఎంచుకోండి
7. ఏటీఎమ్‌లో నగదు ఉంచండి
8. ఎంటర్ చేయండి
9. యంత్రం నగదు ధ్రువీకరించడానికి సమయం పట్టవచ్చు
10. విలువను ప్రదర్శిస్తుంది
11. మీరు మరింత సొమ్మును జమ చేయాలనుకుంటే "మరింత ఎంపికను జోడించు" ఎంచుకోండి
12. నగదుని ఉంచండి
13. నిర్ధారించడంపై క్లిక్ చేయండి
ఎవరైతే నగదుని క్యాష్ డిపాజిట్ మెషిన్ల ద్వారా జమ చేస్తారో వారు తప్పనిసరిగా పిన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అకౌంట్‌లో ఉన్న ప్రస్తుత నగదుని సరి చూసుకోండి. ఎప్పటికప్పుడు ఏటీఎమ్‌కి వెళ్లి మిని స్టేట్‌మెంట్‌ని సరిచూసుకుంటే ఇంకా మంచింది.
దొంగ నోట్లను గుర్తించగలిగే వెసులుబాటు కూడా ఏటీఎమ్ మిషన్‌కు ఉంటుంది. మీరు నగదుని డిపాజిట్ చేసే సమయంలో నోటు చిరిగిపోయినా లేదా మడతపడినా అలాంటి వాటిని మిషన్ స్వీకరించదు.
ఏటీఎమ్ ద్వారానే నగదుని ఎందుకు డిపాజిట్ చేయాలి?
* ఏటీఎమ్ మిషన్ ద్వారా నగదుని డిపాజిట్ చేయడం ద్వారా సమయం ఆదా అవుతుంది.
* నగదుని డిపాజిట్ చేసిన తక్షణమే మీరు మేసేజ్‌ను పొందుతారు.
* మిషన్ ద్వారా నగదు డిపాజిట్ చేయడం సురక్షితం. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో నగదు డిపాజిట్ చేసేముందు మీ పేరుని చూడగలుగుతారు.


Click it and Unblock the Notifications