నరేష్ ఒక మధ్య తరగతి ఉద్యోగి. ఇంటిలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో తన బండిని ఇంటి ముందే నిలిపి ఉంచాడు. తెల్లవారే సరికే బండి మాయం. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటి బారిన మీరు పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రతల్లు పాటించాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం.
వాహనానికి పరికరాలను అమర్చండి:
వాహనాన్ని దొంగలు ఎప్పుడూ ఏ వాహనాన్ని ఎత్తుకెళదామా అనే దృష్టితోనే ఉంటారు. కాబట్టి, ఎప్పటికప్పుడు మన వాహనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి దొంగతనాన్ని నివారించే పరికరాలను టూవీలర్స్, కార్లలో అమర్చుకోవాలి. ఈ పరికరాలను యాంటీ థెప్ట్ అలారం అంటారు. ఈ పరికరాలను అమర్చుకోవడం వల్ల దొంగలు వాహనాన్ని టచ్ చేస్తే చాలు అలారం మోగుతుంది.

పార్కింగ్ ప్లేసులోనే వాహనాన్ని నిలపాలి:
నగరంలోని చాలా దుకాణాల్లో ఈరోజుల్లో పెయిట్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు దీన్ని వినియోగించుకోవాలి. ఈ చిన్నపాటి డబ్బు కట్టేందుకు తప్పించుకొని సురక్షితం లేని ప్రాంతంలో బండి నిలిపితే అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది. అదే మీరు గనుక పెయిట్ పార్కింగ్‌లో పార్క్ చేసినట్లేతే మీ వాహనం సురక్షితం. కొన్ని సందర్బాల్లో మీ వాహనం గనుక చోరికి గురైనట్లైతే, అక్కడున్న వారిని ప్రశ్నించడం లేదా సీసీ కెమెరాల్లో పరిశీలించడం లాంటివి చేయవచ్చు.
ఇన్సూరెన్స్ తప్పనిసరి:
చాలా మంది వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు పూర్తి స్దాయి బీమా పాలసీని తీసుకోరు. దీనిక బదులుగా చట్టబద్దంగా తప్పనిసరైన థర్డ్ పార్టీ పాలసీని ఎంచుకుంటారు. దీని వల్ల మీరు చెల్లించే ప్రీమియంలో కొంత మొత్తాన్ని మిగుల్చుకుంటారు. దొంగతనం, ప్రమాదంలాంటివి జరిగినప్పుడు నష్టానికి ఎలాంటి పరిహారం అందదు. అదే పూర్తి స్ధాయి బీమా తీసుకున్నప్పుడు నిర్ణీత కాలంలో వాహనం దొరక్కపోతే వాహన విలువ ప్రకారం నష్ట పరిహారం అందుతుంది.
వాహన పత్రాలు మీ వద్దే ఉంచుకోండి:
వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన రిజిస్టేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్ పత్రాలు బైకులోనే ఉంచుతారు. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటిని మీ వద్ద ఉంచుకోవాలి. ఒకవేళ మీరు గనుకు మీ వాహనంలో పత్రాలు ఉంచుకోవాల్సి వస్తే జిరాక్స్ తీసి వాటిని ఉంచుకుంటే మంచిది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications