డబ్బులు లేనప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు?
రాము పెళ్లి చేసుకున్నాడు. వివాహం సందర్భంగా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది? చేతిలో డబ్బు అంతా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో సరైన ప్రణాళిక లేకపోతే నిత్య జీవితంలో ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది.
దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో క్రెడిట్ కార్డు వాడకం, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం లాంటివి పెరుగుతాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

* బంగారు నగలను తాకట్టు పెట్టి అప్పు తీసుకోండి.
* జీవిత బీమా పాలసీలను హామీగా పెట్టి రుణం తీసుకోండి.
* మీ దగ్గరి బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ వడ్డీకే వస్తాయి.
* డబ్బు ఇబ్బంది ఏర్పడినప్పుడు మీరు, మీ భార్య పనిచేస్తున్న సంస్ధల నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నించండి. సాధారణంగా ఇలాంటి రుణానికి వడ్డీ ఉండదు.
* సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి.
* ఇంటికి ఈఎంఐలను కడుతుంటే దాని పరిధిని పెంచుకోండి. ఉదాహరణకు మీ ఇంటికి 20 ఏళ్ల వ్యవధిని 25 ఏళ్లకు రుణానికి పెంచుకోండి.
* ఎక్కువగా మీరు ఖర్చుపెట్టే అవసరాలను గుర్తించండి. వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి.
* పాలసీలు చెల్లించే ప్రీమియం మినహా, ఇతర పెట్టుబడులకు కొంత కాలం దూరంగా ఉండండి.
* మీకు తక్కువ రాబడిని ఇస్తున్న పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోండి. ఆ డబ్బుతో అధిక వడ్డీ ఉన్న రుణాలను తీర్చేయండి.
ఉద్యోగం పాటు ఇతరత్రా:
* ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం నిర్వహించండి.
* ఖచ్చితంగా నెలకు ఇంత అప్పు తీర్చాలనే నిబంధనను పెట్టుకోండి.


Click it and Unblock the Notifications