బెంగుళూరు: ఆర్ధిక సర్వే అంటే బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రదర్శించబడే ఒక వార్షిక పత్రం. ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశ ఆర్ధిక మంతి దీనిని ప్రవేశపెడతారు.
ఇది కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖకు సంబంధించిన వార్షిక నివేదిక. ఇది 12 నెలల (ఆర్ధిక సంవత్సరం) కాలంలో భారత ఆర్ధిక వ్యవస్థలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఈ నివేదిక అన్ని ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను వివరించి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానపరమైన అంశాలను ఉటంకించి ఆర్ధికవ్యవస్థ హెచ్చుతగ్గుల స్థాయిలను తెలుపుతుంది.
దేశ ఆర్ధిక స్థితిగతులపై సమాచారాన్ని ఈ సర్వే ద్వారా ఆయన సభికులకు వివరిస్తారు. బడ్జెట్ తీరుతెన్నులను ఈ సర్వే ద్వారా అంచనా వేయొచ్చని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయం. ఈ సర్వే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉన్న ప్రతిబంధకాలను కూడా తెలియజేస్తుంది.
స్వల్ప కాలానికి ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో పాటు, ఆర్ధిక వృద్ధికి కారకమైన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రదర్శన ఎంత మాత్రం ఉందో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఈ సర్వే దేశం యొక్క వివరణాత్మక స్థూల ఆర్థిక పనితీరు తెలుపుతుంది.

ఈ సర్వే అన్ని ఆర్ధిక అంశాలను వివరణాత్మకంగా గణాంక డేటాలో తెలియజేస్తుంది. ఈ నివేదికలో ఈ కింది విషయాల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
1. భారతదేశ ఆర్ధక పనితీరు
2. సవాళ్లు, పాలసీ ప్రతిస్పందనలు, క్లుప్తంగా మధ్యస్ధ పనితీరు
3. ఫిస్కల్ విధానం మరియు ద్రవ్య నిర్వహణ
4. ఆర్ధిక మధ్యవర్తిత్వము మరియు మార్కెట్లు పాత్ర
5. బాహ్య రంగం, చెల్లింపులు సంతులనం, వాణిజ్యం
6. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి మరియు సేవల రంగం
7. శక్తి, మౌలిక సదుపాయాలు మరియు సమాచార
8. మానవ అభివృద్ధి, వాతావరణ మార్పు మరియు ప్రజా కార్యక్రమాలు
9. భారతదేశం యొక్క గ్లోబల్ ఎకానమీ
ఈ ఆర్ధిక సర్వే ద్వారా దేశం యొక్క గత ఏడాది పనితీరుతో పాటు రాబోయే రోజుల్లో దేనిపై దృష్టి పెట్టాలనే దాని గురించి చెప్పే రిపోర్ట్‌గా చెప్పవచ్చు. దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి అన్ని ఏయే రంగాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సూచిస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఆసక్తి ఉన్న ఆర్థికవేత్తలు, విధాన విశ్లేషకులు, వ్యాపార అభ్యాసకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులు, మీడియాకు ఈ ఆర్ధిక సర్వే పత్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications