క్రెడిట్ కార్డుపై 16 అంకెలు... వాటి అర్ధం ఏమిటి?
మనలో చాలా మంది క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డుపై భాగాన ఉన్న 16 అంకెల నెంబర్ చాలా మందికి గుర్తు ఉండదు. అసలు క్రెడిట్ కార్డుపై భాగాన ఉన్న ఈ 16 అంకెలు దేనికి సూచిస్తాయో తెలుసుకుందాం?
క్రెడిట్ కార్డుపై ఉన్న 16 అంకెలు ఏవో ఊరికే ముద్రించినవి కావు. ప్రతి అంకె కూడా ఒకదానికి సూచికగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు తమ తమ క్రెడిట్ కార్డులో ANSI స్టాండెర్డ్ X4.13-1983ను ఉపయోగిస్తున్నాయి.
మీ క్రెడిట్ కార్డు బిల్లు సైకిల్‌ను తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా క్రెడిట్ కార్డు నెంబర్ పొడవు జారీ దారుని బట్టి మారుతుంది. క్రెడిట్ కార్డు పైభాగాన ఉన్న 16 అంకెలు 4 గ్రూపులుగా విభజింపబడ్డాయి.
మొదటి అంకె మేజర్ ఇండస్ట్రీ ఐడెంటీపైర్(mii)ని గుర్తించేదిగా ఉంటుంది. ఈ కార్డు ఎక్కువగా ఉపయోగించారనేది కూడా తెలియజేస్తుంది. వీటన్నింటికి సంబంధించిన వివరాల కోసం మొదటి గ్రూప్‌గావిభజించబడింది.

ఉదాహరణకు
* మీ క్రెడిట్ కార్డు 1 లేదా 2తో మొదలయితే ఎయిర్ లైన్స్ జారీ చేసిందిగా గుర్తిస్తారు.
* 3 అమెరికన్ ఎక్సప్రెస్, డిన్నర్స్ క్లబ్
* 4 వీసా కార్డు (బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కార్డులు)
* 5 మాస్టర్ కార్డు (బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కార్డులు)
* 6 డిస్కవర్ కార్డు (మర్చంటింగ్, బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కార్డులు)
* 7 పెట్రోలియం కార్డులు
* 8 టెలి కమ్యూనికేషన్ కార్డులు
* 9 జాతీయ విధి నిర్వహణకు సంబంధించిన కార్డులు
రెండవ గ్రూప్:
రెండవ గ్రూప్‌లో ఉన్న నాలుగు అంకెలు జారీదారు ఐడింటిఫికేషన్ నెంబర్ (IIN)ను సూచిస్తాయి. ఏ బ్యాంకు కార్డుని జారీ చేసింది (దేశం, కార్టు టైపు) తదితర సమాచారాన్ని తెలియజేస్తాయి.
మూడవ గ్రూప్:
అకౌంట్ నెంబర్‌ను సూచిస్తాయి.
నాల్గవ గ్రూప్:
క్రెడిట్ కార్డు చివరి భాగాన ఉన్న నాలుగు అంకెలు మీ క్రెడిట్ కార్డు నెంబర్‌ను పరిశీలించడం, నిర్ధారించడంలో సహాయపడుతుంది
ఇక చివరగా క్రెడిట్ కార్డు వెనుక పక్క ఉన్న మూడు అంకెల నెంబర్ ఆన్ లైన్ లేదా టెలిఫోన్‌లో లావా దేవీలు చేసేటప్పుడు ఎంతో కీలకం. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications