న్యూఢిల్లీ: అమెరికా, కెనడా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కరెన్సీని డాలర్స్‌లో ముద్దుగా పిలుచుకుంటుంటారు. అసలు ఈ డాలర్ అనే పదం ఎలా పుట్టింది? అనేది తెలుసుకుందాం. పదిహేనవ శతాబ్ధంలో జర్మనీలో పెద్ద సైజు వెండి నాణేలను ముద్రించేవారట.
ఆ వెండి 'ధల్' అనే లోయనుంచి తీయబడింది. కాలక్రమేనా ధల్‌ని ధోల్‌గా పలికారు. ఆ నాణేలని ధోలర్ (లోయనించి) అని పిలుచుకునేవారట. ఆ కాలంలో ధోలర్స్ యూరప్‌లోని అన్నిదేశాల్లో చలామణి అయ్యేవి. ప్రతి దేశం కూడా ధోలర్‌ని తమ భాషలో, తమ లిపిలో రాసుకునేవారట.

యూరోపియన్ దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ భాష (డచ్)లో వీటిని డేలర్స్‌గా పలికేవారట. కాలక్రమంలో ఈ డేలర్స్ కాస్త డాలర్‌గా మారింది. అమెరికాలో స్పానిష్ కాలనీల్లో ఈ డేలర్స్ చెల్లుబాటు అయ్యేవి. ఆ తర్వాతి రోజుల్లో అమెరికన్ మింట్ కూడా తమ వెండి నాణేలను ధోలర్స్ నాణేలతో సమానమైన బరువుతో ముద్రించింది.
ఈ నాణేలకు అధికారకంగా డాలర్ అనే పేరుని అమెరికా ప్రభుత్వం పెట్టడంతో డాలర్స్ అయ్యాయి. తర్వాతి రోజుల్లో కాగితం నోట్లను ముద్రించినా వాటిపై కూడా డాలర్ పేరునే ముద్రించాయి. ఈ విధంగా అమెరికాలో కరెన్సీకి డాలర్ అనే పేరు పుట్టింది. అమెరికాతో పాటు సింగపూర్, ఆస్టేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లోని కరెన్సీ పేరు కూడా డాలరే కావడం విశేషం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications