స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే ఏం చేయాలి?
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల వెనకున్న ముఖ్య ఉద్దేశం లాభాలు ఆర్జించడం. కానీ క్షణక్షణం మారే స్టాక్ మార్కెట్లలో లాభాలు ఆర్జించాలంటే ఎన్నో వ్యూహాలు ఉండాలి. అదును చూసి షేర్లను అమ్మి, లాభాలను ఆర్జించాలంటే ఏం చేయాలో చూద్దాం.
సాధారణంగా మార్కెట్ పతనం అవుతున్నప్పుడు మంచి షేర్లను చాలా మంది అమ్మేస్తుంటారు. ఇలాంటప్పుడే వాటని కొనుగోలు చేయాలి. అలాంటి సందర్భంలో మన వద్ద ఉన్న షేర్లను మంచి ధరకు అమ్మాలి.
తప్పులు చేయడం సర్వ సాధారణం:
కొన్నిసార్లు ఒక కంపెనీ మీద విపరీతమైన నమ్మకంతో షేర్లు కొంటాం. కానీ, ఎన్నేళ్లు గడిచినా ఆ కంపెనీలో మాత్రం ఎలాంటి వృద్ధి కనిపించదు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ షేర్లను నుంచి బయటకు రావాలి.

పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పులు చేయడం సర్వసాధారణం. దాన్ని వీలైనంత తొందరగా గుర్తించి, సరిదిద్దుకుంటే మంచి మదుపరి అవుతారు. కొంత మంది పనికిమాలిన షేరు కొన్నామని తెలిశాక, అది ఎప్పటికైనా పెరగకపోతుందా అనే ఆశాభావంతో ఉంటారు.
ఇలా చేయడం వల్ల పెట్టుబడి మొత్తం పొగొట్టుకోవడంతో పాటు, ఇతర పెట్టుబడి అవకాశాలను కూడా దూరం చేస్తాయి. విజయవంతమైన మదుపరి తమ తప్పును తెలుసుకోగానే, వెంటనే ఆ షేరును అమ్మేసేందుకు ప్రయత్నిస్తాడు.
నష్టాలు వస్తున్నప్పుడు?
సాధారణంగా ఒక కంపెనీ షేర్లలో మదుపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కంపెనీ నిర్వహణలో తేడాల వల్ల నష్టాలు రావచ్చు. ఇలాంటప్పుడు ఆ కంపెనీ నుంచి వీలైనంత తొందరగా బయట పడాలి.
కంపెనీలు తమ అసలు వ్యాపారం కాకుండా, ఇతర రంగాల వైపు దృష్టి పెడుతుంటే మదుపర్లు అప్రమత్తం కావాల్సి ఉంది. వాళ్లు పెట్టుబడి పెట్టే రంగాలు అంత లాభసాటిగా లేకపోవచ్చనే సూచనలు ఉంటే, వెంటనే ఆ షేరు నుంచి వైదొలగడం మంచింది.
షేరు ధర పెరిగితే అమ్మేయడం ఉత్తమం:
కొన్ని సందర్భాల్లో షేర్లు ధరలు అనుకోకుండా భారీగా వృద్ధి చెందుతాయి. పెరిగినంత వేగంగా పడిపోవడానికీ ఆస్కారం ఉందని గమనించాలి. ఇలాంటి సందర్భాల్లో ఆ షేర్లను అమ్మేయడమే ఉత్తమం.
షేర్లను మళ్లించడం:
మీరు ఇప్పటికే కొన్ని షేర్లలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారని అనుకుందాం. వాటిలో వృద్ధి అంతంత మాత్రం ఉంటే, అంతకన్నా మంచి కంపెనీల షేర్లకు ఆ పెట్టుబడి మొత్తాన్ని మళ్లించడం వల్ల అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications