న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన' పథకం పెద్ద సక్సెస్ అయింది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద తక్కువ సమయంలో గరిష్ఠ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి.
ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్ ధన్ యోజన కింద తెరిచారు. ఈ పథకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించుకోవడం విశేషం. అసలు జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాలను తెరవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్:
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాను తెరిస్తే... కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ని అందిస్తుంది. పేద, మధ్య తరగతి వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఇన్సూరెన్స్‌ని అందించడం విశేషం. ప్రమాదవశాత్తు భీమా కవరేజి కింది సుమారు రూ. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ భీమా సౌకర్యం ఉంది.
ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన్ పథకంలో ఎలాంటి బ్యాలెన్స్ అక్కల్లేదు:
బ్యాంకుల్లో సాధారణం సేవింగ్స్ ఖాతా ఉండాలంటే బ్యాంకులు కస్టమర్ల వద్ద నుంచి మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిందిగా సూచిస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ కింద రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు ఉంచాలి. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉంచాలి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ప్రారంభించబడిన ఖాతాల విషయంలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు.

రూ. 30,000 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్:
ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన్ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాలకు రూ. రూ. 30,000 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని అందిస్తుంది.
నగదు డైరెక్టుగా ఖాతాలోకే బదిలీ అవుతుంది:
ఈ పథకం ద్వారా తెరిచిన ఖాతాల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వచ్చే నగదు బదిలీలుగా డైరెక్టుగా తమ వారి ఖాతాల్లోకి జమ చేయడానికి వీలవుతుంది.
బ్యాంక్ ఖాతాల వల్ల మహిళల కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది.
ఈజీగా నగదు బదిలీ:
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచిన కస్టమర్లు ఈజీగా నగదుని బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ముఖ్యంగా ఇది పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగపడనుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ:
ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ సదుపాయన్ని ఆరు నెలలు విజయవంతంగా బ్యాంకు ఖాతాలో లావాదేవీలు నిర్వహించిన తర్వాతే అందిస్తున్నారు.
ఇతర ఆర్ధిక ఉత్పత్తులను పొందే అవకాశం:
పెన్షన్, ఇతర ఇన్సూరెన్స్ ఉత్పుత్తులను పొందేందుకు ఈ బ్యాంకు ఖాతాలో అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం అంటే ఏమిటి?
ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ప్రజలు ముఖ్యంగా పేదలు వారి కష్టార్జీతాన్ని బ్యాంక్ ఖాతాలలో పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుటకు వీలు కలుగుతుంది. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ది, సంక్షేమ ఫలాల లబ్దిని నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడానికి వీలవుతుంది.
దీని ద్వారా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అవినీతిని పారద్రోలడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యాంక్ ఖాతాలు మహిళల పేరున ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. దేశంలోని 120 కోట్ల జనాభాలో 90 శాతం పేద వారే ఉన్నారని, బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం ద్వారా పేద వారితో పాటు బ్యాంక్‌లకు, రైతులకు ఆర్థిక స్వావలంభన కలుగుతుంది
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications