ఒక ప్రయాణీకుడు విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గిపోవడంతో జనం బంగారాన్ని తెగ కొంటున్నారు. దీంతో పాటు బంగారం అంటే పడి చచ్చే భారతీయలు బంగారాన్ని విదేశాల నుంచి తెచ్చుకోవడం, తెప్పించుకోవడం బాగా పెరిగింది. విదేశాల నుంచి బంగారం తీసుకువస్తూ శంషాబాద్ విమాశ్రయంలో చాలా మంది దొరికిపోతున్న వార్తలు తాజాగా మనం చాలానే చూస్తున్నాం.

పురుషు ప్రయాణీకులకు రూ. 50,000, స్త్రీ ప్రయాణీకులకు 1 లక్ష
విదేశాల నుంచి ఆభరణాలను ఉచితంగా తీసుకొచ్చేందుకు భారతీయ పురుష ప్రయాణీకులకు రూ. 50,000, స్త్రీ ప్రయాణీకులకు రూ. 1 లక్ష వరకు అనుమతి ఉంది. దీని కోసం గాను ప్రయాణీకుల ఒక సంవత్సరం పాటు కంటే ఎక్కవ విదేశాల్లో నివాసం ఉండి తీరాలి అనే నిబంధన ఉంది.

ఒక వ్యక్తికి ఒక కేజీ
కస్టమ్ డ్యూటీ చెల్లించినట్లైతే ఒక వ్యక్తి ఒక కేజీ బంగారం వరకు తన వెంట తీసుకురావచ్చు. భారత సంతతికి చెందిన ప్రయాణీకులు సరైన పాస్ పోర్టు ఉంటే దీనికి అర్హులు. విదేశాల నుంచి భారత్‌నుచూసేందుకు వస్తున్న ప్రయాణీకులు కూడా బంగారాన్ని తీసుకురావచ్చు, ఐతే తప్పనిసరిగా 30 రోజులు భారత్‌లో ఉండాలి.

బంగారు కడ్డీలుకి కొన్ని నిబంధనలు
విదేశాల నుండి మీరు గనుక బంగారు కడ్డీలు తీసుకువస్తున్నట్లైతే కొన్ని నిబంధనలున్నాయి. బంగారు కడ్డీలు క్రమ సంఖ్య, బరువుతో పాటు తయారీ దారు పేరు తప్పనిసరిగా ఉండాలి.

కస్టమ్ డ్యూటీ చెల్లించండి
బంగారు నాణేలు లేదా బంగారు కడ్డీలు దిగుమతి చేసుకునే వారు తప్పనిసరిగా కస్టమ్ డ్యూటీ చెల్లించాలి.

సరైన మార్గంలో నడవండి
విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తున్న వ్యక్తులు కస్టమ్ డ్యూటీ చెల్లించి, గ్రీన్ ఛానల్ మార్గంలో నడిచి రండి. ఒకవేళ తీసుకురావాల్సిన దానికంటే ఎక్కువ బంగారాన్ని తీసుకొస్తున్నట్లైతే కస్టమ్ అధికారులు మిమ్మల్ని 1962 కస్టమ్స్ చట్ట ప్రకారం అరెస్టు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications