డూప్లికేట్ ఎల్‌ఐసీ డాక్యుమెంట్ పొందడం ఎలా?
న్యూఢిల్లీ: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఎల్‌ఐసీ పాలసీని తీసుకుంటున్నారు. తీసుకున్న పాలసీని మనం పొగొట్టుకున్నట్లైతే తిరిగి పొందడం ఎలా తెలుసుకుందాం?. మొదటగా డూప్లికేట్ ఎల్‌ఐసీ కాపీకి అప్లై చేసే ముందుగా మన ఇంట్లో బీరువా లేదా వేరే ఎక్కడైనా పెట్టామో జాగ్రత్తగా వెతకాలి.
దొరకని పక్షంలో మొదటగా మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న సంస్ధను సంప్రదించాలి. ఓరిజినల్‌గా ఎవరైతే పాలసీని తీసుకున్నారో ఆ వ్యక్తి మాత్రమే సంస్ధ వద్దకు వెళ్లి డూప్లికేట్ ఎల్‌ఐసీ పాలసీ కాపీ కావాలని అడిగాల్సి ఉంటంది.

డూప్లికేట్ ఎల్‌ఐసీ పాలసీ కాపీ పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలు:
* మీ ఎల్‌ఐసీ పాలసీ కాపీని పొగొట్టుకున్నట్లు ఇంగ్లీషు లేదా తెలుగు డైలీ న్యూస్ పేపర్‌లో ప్రకటన వచ్చేలా చేయాలి.
* మీరు న్యూస్ పేపర్‌లో ఇచ్చిన ప్రకటనను ఏ సంస్ధ దగ్గరైతే మీరు పాలసీని తీసుకున్నారో ఆ సంస్ధకు పంపించాలి.
* మీ పాలసీకి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను ఆ సంస్ధ జారీ చేస్తుంది. తర్వాత డూప్లికేట్ ఎల్‌ఐసీ కాపీని మీ ఇంటికి స్వయంగా పంపడం జరుగుతుంది. ఇందుకు కస్టమర్ కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా ఏయే సందర్భాల్లో పేపరు ప్రకటన వేయాల్సి ఉంటుంది:
* పాలసీ డాక్యుమెంట్ దొంగతనం చేయబడటం
* పాలసీ డాక్యుమెంట్ అగ్ని ఆహుతి అవడం
* పాలసీ డాక్యుమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో నిర్బంధం వల్ల
* పాలసీ డాక్యుమెంట్ దెబ్బతినడం
* పాలసీ డాక్యుమెంట్ కనిపించక పోవడం
* పాలసీ డాక్యుమెంట్ పాక్షికంగా తెలుపు చీమలు నాశనం చేయడం వల్ల
ప్రకృతి వైపరిత్యాలైన భూకంపాలు, అగ్ని మొదలగున వాటి వల్ల మీ ఎల్‌ఐసీ డాక్యుమెంట్ పాక్షికంగా దెబ్బతింటే, దానిని సంస్ధకు అప్పగించి డూప్లికేట్ ఎల్‌ఐసీ డాక్యుమెంట్‌ను తిరిగి పొందవచ్చు.


Click it and Unblock the Notifications