హైదరాబాద్: ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి), రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డి) ఈ రెండు డిపాజిట్లు కూడా పెట్టుబడులకు రక్షణ కల్పించి స్థిరమైన రాబడులను కస్టమర్లకు అందిస్తాయి. లిక్విడిటీ అవకాశాలు ఈ రెండిట్లోనూ సమానంగా ఉంటాయి. ఈ డిపాజిట్లపై రుణం తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ కంటే ముందే కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
విత్‌డ్రా చేసుకునే సందర్భంలో కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రాబడుల పరంగా చూస్తే రెండు డిపాజిట్లు పోల్చితే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మొదటి స్ధానం లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మొత్తం డబ్బుని ఒకేసారి డిపాజిట్ చేస్తాం. అందుకే మొదటి నెల నుంచి వచ్చే వడ్డీ గరిష్ట స్ధాయిలో ఉంటుంది.

ఇక రికరింగ్ డిపాజిట్లు అంటే నెల నెల కొంత డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. వడ్డీలో తేడాలుంటాయి. నెల నెల వచ్చే వడ్డీలో కూడా మారుతుంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి జత చేరడంతో రాబడులు ఎక్కువగా ఉంటాయి.
ఇక రికరింగ్ డిపాటిట్ పెట్టుబడులపై పెట్టుబడిదారుడు చక్రవడ్డీని పూర్తిస్దాయిలో పొందలేడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా ఒక ఏడాదిలో అందే వడ్డీ రాబడులు రూ. 10,000కు మించితే బ్యాంకు టిడిఎస్ రూపంలో పన్ను వసూలు చేస్తుంది. చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ ఉత్తమం. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చక్కగా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications