పెట్టుబడిలో అవకాశ వ్యయం అంటే?

పెట్టుబడి నిర్ణయంలో అవకాశ వ్యయం:
అవకాశ వ్యయం అంటే ఒక చర్యకు బదులు ఎక్కువ లాభాలను తీసుకువచ్చే అలాంటిదే మరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం. ఒక పెట్టుబడిదారుడు సంవత్సర కాలంలో 2శాతం పెట్టుబడి పెట్టాడనుకుందాం, ఇదే సమయంలో రిస్కు లేనటువంటి ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఇందులో అతని అవకాశ వ్యయం 6శాతంగా (8-2)చెప్పుకోవచ్చు. అందుకోసమే ఉన్న అవకాశాలలో మెరుగైన అవకాశాన్ని ఎంచుకుని రిస్కు లేని ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువ మొత్తంలో రిస్కు లేని అవకాశాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అవకాశ వ్యయం ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మంచి అవకాశాలను ఎంచుకోవడం ద్వారా తమ ఖర్చులో భద్రతను పెంచుకోవచ్చు. మెరుగైన ప్రత్యామ్నాయ అవకాశాలను ఎంచుకోవడం ద్వారా తమ మూలధనానికి కూడా భద్రత చేకూరుతుంది.
తక్కువ రిస్కుతో ఎక్కువ లాభాలను చేకూర్చే అవకాశ వ్యయాలను ఎంచుకోవడం స్టాక్ ట్రేడింగ్‌లో మీకు ఎదురయ్యే రిస్కును తగ్గించుకోవచ్చు. స్థిరమైన ఆదాయ సాధనాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు పెట్టుబడిదారునికి ఎక్కువ భద్రత, లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వారు గానీ, లేదా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వారు గానీ ఎవరైనా తమ రిస్కును తక్కువగానే ఉండాలని కోరుకుంటారు కాబట్టి పెట్టుబడి దారులందరూ అవకాశ వ్యయాన్ని ఎంచుకోవడం ద్వారా తమ రిస్కు తగ్గించుకోవడమే గాకుండా ఎక్కువ లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications