ఉన్నత స్థాయి లివరేజి కంపెనీగా ఉండటమంటే..?

ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, కంపెనీలు సాధారణంగా తమ ఆర్థిక కార్యకలాపాలను రెండు పద్ధతుల ద్వారా నిర్వహించుకుంటాయి. ఒకటి సొంత మూలధనం లేదా ఈక్విటీ, మూలధన రుణం పద్ధతుల ద్వారా తమకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటాయి. ఒక వేళ సొంత ఆస్తి కంటే అప్పు తీసుకున్న మూలధనం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పరిధి ఉన్నతస్థాయి పరపతి(లివరేజి)ని తెలియజేస్తుంది.
ఉన్నతస్థాయి పరపతి(లివరేజి) పొజిషన్
ఒక వేళ ఒక సంస్థ ఆస్తులను తన సొంత మూలధనంతో కొనుగోలు చేసినట్లయితే అది పరపతి(లివరేజి) అనిపించుకోదు. అలా కాకుండా ఒక పరికరాన్ని 80శాతం రుణంగా, 20శాతం సొంత మూలధనంతో కొనుగోలు చేసినట్లయితే అది ఉన్నతస్థాయి పరపతిగా చెప్పవచ్చు. ఆ తర్వాత తీసుకునే రుణాలు కూడా పరపతిపై ప్రభావం చూపిస్తాయి.
పరపతి కంపెనీలు.. స్వయం పెట్టుబడి పెట్టిన కంపెనీలతో పోల్చితే కొంత మేర అనిశ్చితి స్థితిలో ఉండే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. పరపతి కంపెనీలు వారు తీసుకున్న రుణాలకుమించి అత్యధికంగా లాభాలను పొందినప్పుడు మాత్రమే తాము తీసుకున్న రుణాలను తీర్చే అవకాశం ఉంటుంది.
లివరేజి అనేది సాధారణంగా కంపెనీల ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపించడమే కాకుండా పెట్టుబడులను ప్రోత్సహించడంలొ కీలక పాత్ర పోషిస్తుంది. పరపతి విధానంలో పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు భవిష్యత్‌లో సంస్థ రిస్క్‌ను నిర్దేశిస్తాయి. పరపతి విధానం ద్వారా కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంస్థలు పెట్టుబడులపై లాభాలను ఆర్జించనట్లయితే సంస్థలు దివాలా తీసే అవకాశమూ ఉంటుంది. ఈ కారణంగానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తులకు ఎక్కువ పరపతిని అందించేందుకు ముందుకు రాలేకపోతున్నాయి.


Click it and Unblock the Notifications