
ఎఫ్‌సిఎన్ఆర్ స్వాప్ ఒప్పందంలో భాగంగా ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం ఇన్సెంటివైస్ బ్యాంకులు ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్లను నవంబర్ 30, 2013వరకు సేకరించవచ్చు. కొత్తగా సేకరించే ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్లపై కనీసం మూడు సంవత్సరాలకు గాను 3.5శాతం ఫిక్స్‌డ్ రేటును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానం ద్వారా బ్యాంకులు తమ ఖర్చులో సుమారు 7శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఆర్‌బిఐ ప్రోత్సాహక విధానం ద్వారా బ్యాంకులు విదేశీ కరెన్సీని దేశంలోకి మొబిలైజ్ చేయడం జరుగుతుంది.
ఫారెన్ ఎక్సేంజి రేటులో ఒడిదుడికులు, ఫారెన్స్ కరెన్సీ రిస్కు తట్టుకునేందుకు బ్యాంకులు విదేశీ కరెన్సీ సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫార్వర్డ్ రేటు లేదా బ్యాంకులు విదేశీ కరెన్సీని కొనేందుకు అంగీకరించిన మొత్తం సంవత్సరానికి 7శాతంగా ఉంటుంది లేదా ఖర్చులు తగ్గించేందుకు 3.5శాతం మేర ఉండే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశం ద్వారా నవంబర్ 30, 2013వరకు ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్లు సేకరించవచ్చు.
ఎన్నారైల కోసం స్వాప్ సౌకర్యం
స్వాప్ సౌకర్యం ద్వారా విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల నుంచి విదేశీ కరెన్సీని మనదేశంలోని బ్యాంకులు సేకరిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో స్వాప్ సౌకర్యం ద్వారా 3-4శాతం మేర ఆర్జించే అవకాశం ఉంటుంది. పన్నుల విషయంలో కూడా ప్రయోజనాలున్నాయి. కరెన్సీ రిస్కు ఉండదు, ఇది ఖచ్చితంగా ఎన్నారైలకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ డిపాజిట్ల ద్వారా ఎన్నారైలకు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండకపోచ్చు, మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న డిపాజిట్లపై 5శాతం కంటే ఎక్కువగా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications