క్రైసిల్ రియల్ ఎస్టేట్ స్టార్ రేటింగ్స్ అంటే ఏమిటి?

క్రైసిల్ స్టార్ రేటింగ్ ఇవ్వడం మూలంగా ఆర్థిక సంస్థలు, డెవలపర్స్ మొదలగు సంస్థలన్నీ తమ ప్రాజెక్టుల ఆచరణ సాధ్యతను బట్టి నిధులు కేటాయించడం జరగుతుంది. రేటింగ్ ఇచ్చే ముందు ప్రాజెక్టుల న్యాయ సంబంధ పత్రాలు, ప్రాజెక్టు ఆర్థిక అంశాల ఆచరణ సాధ్యత, స్పాన్సర్ యొక్క చరిత్ర, నిర్మాణ సంబంధ ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. డెవలపర్స్ అనుసరించే విధానాన్ని కూడా క్రైసిల్ పరిగణలోకి తీసుకుంటుంది.
ప్రాజెక్టు ఆర్థిక వనరులు, నూతనత్వం, నిర్మాణంలో సాంకేతికత, ప్రాజెక్టు రూపకల్పన, ఆర్థిక అంశాల లభ్యత, లిఖితమైన నియంత్రణలు, అమ్మకాల సేవలు, నాణ్యత ప్రమాణాలు, ఎంత సమయానికి ఎంత ఖర్చుతో పూర్తవుతుందనే అంశాలను క్రైసిల్ రేటింగ్ పరిగణలోకి తీసుకుంటుంది.
క్రైసిల్ స్టార్ రేటింగ్స్ స్కేల్
నగరాలను బట్టి స్టార్ రేటింగ్ విధానంలో.. ఎనిమిది పాయింట్ల స్థాయితో నాన్ డెలివరబుల్ ప్రాజెక్టులు కిందిస్థాయి రేటింగ్‌లో ఉంటే.. ఏ ప్రాజెక్టులైతే 7స్టార్లు పొందుతాయో అవే అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా నమోదవుతాయి.
ఆస్తుల కొనుగోలుదారులకు స్టార్ రేటింగ్ వల్ల ప్రయోజనాలు
స్టార్ రేటింగ్ అత్యుత్తమ రేటింగ్ ఇచ్చిన ఆస్తులను కొనుగోలుదారులు రెండో ఆలోచన లేకుండా కొనుగోలు ఒప్పందం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల తక్కువ రేటింగ్ ఒక స్టార్ నుంచి మొదలై 7స్టార్ వరకు ఇవ్వడం జరుగుతుంది. కొనుగోలుదారులు రేటింగ్‌ను బట్టి ప్రాజెక్టులను పరిశీలించి తాము కోరుకుంటున్న ఆస్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. క్రైసిల్.. కంపెనీల ప్రాజెక్టులను 4 నుంచి 5వారాలపాటు పరిశీలిలంచిన తర్వాత ఆ ప్రాజెక్టులకు తగిన రేటింగ్‌ను కేటాయిస్తుంది. అయితే కొన్ని సంస్థలు క్రైసిల్ రేటింగ్ సంస్థ.. తమ సంస్థలను పరిశీలించేందుకు దరఖాస్తు చేసుకోనట్లయితే వాటి గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. క్రైసిల్ సంస్థ ఎలాగైతే పరిశీలించి రేటింగ్ ఇస్తుందో మీరు కూడా ఆ విధంగా పరిశీలించిన తర్వాత ఉత్తమమైన ప్రాజెక్ట్ అని అనుకుంటే ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications