
కరెన్సీతో కరెన్సీ ఫ్యూచర్స్ అంతర్లీనమైన ఆస్తులుగా ఉండి పటిష్టమైన కాంట్రాక్ట్‌లకు అవకాశం ఏర్పడుతుంది. కాంట్రాక్టులు.. రెండు పార్టీల ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫ్యూచర్ టైమ్‌లో వచ్చిన ధరల మార్పులకు అనుకుగుణంగా ఆర్థిక సాధనాన్ని అమ్మడం గానీ, కొనడం గానీ జరుగుతుంది. ధర అనేది మార్కెట్ శక్తులను నిర్ణయిస్తుంది.
కరెన్సీ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ ప్రారంభించేందుకు మొదటగా కరెన్సీ డిరైవెటివ్స్‌ను రిజిష్టర్ చేయించాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత బ్రోకర్ సహాయంతో డిమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించాలి. మీరు ఎంచుకున్న బ్రొకరేజి సంస్థలలో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరపడం కోసం డిమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది.
డాక్యుమెంటేషన్‌లో ఒప్పంద పత్రం, నష్ట భయం, వినతి పత్రం, కరెన్సీ డిరైవెటివ్స్‌లకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మీరు గనక కొత్త కస్టమర్ అయితే గుర్తింపు, చిరునామా రుజువుకు సంబంధించిన పత్రాలను కూడా డాక్యుమెంటేషన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత వాణిజ్యం కోసం మీకు సమాచారం అందుతుంది, ఆ తర్వాత కొంత సమయంలోనే మీ కరెన్సీ ఫ్యూచర్స్‌ను ప్రారంభించవచ్చు.
కరెన్సీ ట్రేడింగ్ ప్రారంభించే విధానం
బ్రోకరేజి నుంచి మీరు కరెన్సీ ఫ్యూచర్స్ సంబంధించిన ఖాతా వివరాలను పొందినట్లయితే మీరు ఖాతాను ఆన్‌లైన్‌లో నియమ, నిబంధనలకు లోబడి లాగిన్ అవోచ్చు. అలోకేషన్‌లో మార్పు చేసేందుకు మీరు లింక్ ద్వారా వివిధ కేటగిరీలలో వాణిజ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. విభిన్నమైన వ్యవహారాలకు ప్రత్యేకమైన ఎక్సేంజిలను భిన్నమైన బ్రోకరేజీల ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్సేంజిలలో సోమవారం నుంచి శుక్రవారం (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల) వరకు కరెన్సీ వాణిజ్యం జరుగుతుంది. కరెన్సీ వాణిజ్యంలో కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. బ్రోకరేజీల కాల్ సెంటర్ల నుంచి వాణిజ్యానికి సంబంధించిన ఫోన్ కాల్స్ మీకు వస్తుంటాయి.


Click it and Unblock the Notifications