ఆర్థిక వ్యవస్థలో డిలివరేజింగ్ అంటే?

డిలివరేజి అనే పదం లివరేజికి (ఆస్తులకు సమకూర్చుకొని లాభాలను పెంచుకోవడానికి, నష్టాలను తగ్గించుకోవడానికి అప్పు సేకరించే ప్రక్రియ) వ్యతిరేకమైన పదం. ఇది సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, స్థూల ఆర్థిక వ్యవస్థ రెండింటికి వర్తింపజేయవచ్చు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో ఈ విధానం ద్వారా కంపెనీలు, వ్యక్తులు తమ రుణ భారాన్ని లేదా రుణ మొత్తం శాతాన్ని తగ్గించుకుంటాయి. అదే విధంగా స్థూల ఆర్థిక వ్యవస్థలో రుణ తగ్గుదల ఈ ప్రభావం వివిధ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో డిలివరేజి విస్తరణ మేరకు జాతీయ ఖాతా జిడిపి నిష్పత్తి కూడా దాని ప్రభావాన్ని గుర్తించడం జరిగింది. డిలివరేజి అనే ప్రక్రియ ముఖ్యమైన అంశం, అంతేగాక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం పేర్కొనవచ్చు.
డిలివరేజింగ్ ప్రక్రియ అమలు ఎలా?
వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు డిలివరేజి లేదా వారి అప్పులను నగదు రూపంలో గానీ బాండ్లు, వాటాలు, రియల్ ఎస్టేట్స్ వంటి ఆస్తులను అమ్మడం ద్వారా గానీ తగ్గించుకోవచ్చు.
ప్రక్రియ అవసరమేంటి?
అవసరానికి మించిన అప్పులు ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తాయి. రుణం అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఓ రకమైన ఇంధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. మితిమీరిన అప్పులు తీసుకునే విధానం కారణంగా సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉంటుంది. తీసుకున్న రుణం చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే అప్పు ఇచ్చే సంస్థలపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో రుణ సంస్థలు తమ రుణాలు తిరిగిరాని పరిస్థితి ఏర్పడితే అప్పు ఇచ్చే మొత్తాలను కూడా ఆ సంస్థలు తగ్గించే అవకాశం ఏర్పడుతుంది.
ఒక విధంగా చూస్తే లివరేజి వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనాలున్నప్పటికీ మరో విధంగా చూస్తే కొన్ని లోపాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా డిలివరేజి విధానం అమలులోకి వచ్చింది. దీంతో రిస్కు పరిమాణాన్ని తగ్గించి సంస్థ కార్యకలాపాలపై యాజమాన్యాలు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దీని వల్ల పెట్టుబడి చక్రం వేగంగా తిరిగి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. డిలివరేజితో సంస్థలకు ఇతర లాభాలు కూడా పొందే వీలుంది.
భారత్ లో డిలివరేజింగ్
మాంద్యం ప్రభావంతో అన్ని విధాలుగా కంపెనీలు దెబ్బతిన్నడం జరిగింది. దీంతో రుణ సేవలను పొందడం కూడా కష్టమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక మొత్తంలో రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థలు ఆశించిన ఫలితాలు రాకపోగా సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలూ ఉన్నాయి.


Click it and Unblock the Notifications