మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటి అంటే ఏమిటి?

కేంద్ర బ్యాంకు నుంచి ఒక్క రాత్రిలో తమ వద్ద ఉన్న మూలధనంలో 1శాతం మేర అప్పును మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ విధానం ద్వారా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు పొందవచ్చు. ఎంఎస్ఎఫ్ విధానం ద్వారా బ్యాంకులు స్టాచుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్ఎల్ఆర్)కు కొంత మొత్తం మేర అదనంగా కూడా పొందవచ్చు. ఎంఎస్ఎఫ్ రేట్ల ప్రకారం బ్యాంకులు తమకు అవసరం ఉన్నప్పుడు రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎంఎస్ఎఫ్ విధానం ద్వారా బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా ద్రవ్యాన్ని సేకరించుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు రిజర్వు బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల మద్దతుతో ఇతర బ్యాంకులు రుణం పొందినట్లయితే ఆ మొత్తంపై 5శాతం మార్జిన్‌తో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు తీసుకున్నట్లయితే ప్రత్యామ్నాయంగా 10శాతం మార్జిన్‌తో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంఎస్ఎఫ్ విధానం భిన్న వాణిజ్య బ్యాంకులు కనీస మొత్తంగా కోటి రూపాయల వరకు ఉపయోగించుకోవచ్చు. ఎంఎస్ఎఫ్ విధానంలో వడ్డీ రేటు 100 బేసిస్ పాయింట్ల వద్ద స్థిరంగా (1 బేసిస్ పాయింట్ అంటే వందలో ఒకశాతం) రెపోరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. రెపోరేటు అంటే వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తంపై చెల్లించే వడ్డీరేటు. కఠినమైన ద్రవ్య నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ రెపో రేటుపై ఎక్కువగా వసూలు చేసే మొత్తాన్ని ద్రవ్య సర్దుబాటు సౌకర్యం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
రెపోరేటు, రివర్స్ రెపోరేటు, ఎల్ఏఎఫ్ ల ద్వారా బ్యాంకులు రోజువారీ ద్రవ్యంలో వచ్చే వ్యత్యాసాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. వాణిజ్యం బ్యాంకులు తమ వద్ద ద్రవ్యం తక్కువగా ఉన్న సమయంలో రిజర్వు బ్యాంకు నుంచి రెపోరేటుపై ద్రవ్యాన్ని రుణంగా తీసుకుంటాయి. రెపోరేటు ద్వారా రిజర్వు బ్యాంకుకు వడ్డీ రూపంలో ద్రవ్యం చేకూరుతుంది.
జులైలో ఎంఎస్ఎఫ్ రేటును 10.25శాతానికి పెంచడం ద్వారా రూపాయి, డాలర్ కొనుగోలు వ్యత్యాసాలను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసింది. 75 బేసిస్ పాయింట్ల నుంచి 9.5శాతం కోత విధించడం ద్వారా డాలర్‌తో సమానంగా రూపాయి స్థిరత్వం పొందేందుకు అవకాశం ఉంటుందని రిజర్వు బ్యాంకు పేర్కొంది.


Click it and Unblock the Notifications