
గ్రీన్‌షూ ఆప్షన్ వల్ల కంపెనీలు సేకరించాల్సిన మూలధనం కంటే కొంతమేర ఎక్కువ నిధులు కూడా ప్రజల నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. మొదటిసారిగా గ్రీన్‌షూ తయారీ కంపెనీ ఈ సదుపాయాన్ని కల్పించుకోవడం ద్వారా ఈ సదుపాయాన్ని గ్రీన్ షూగా పిలువడం జరుగుతోంది. అయితే ప్రజల నుంచి కంపెనీలు సేకరించాల్సిన మూలధనంపై నియంత్రణ అధికారం మన దేశంలో (సెక్యూరిటీ ఎక్సేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) సెబికి ఉంటుంది.
గ్రీన్‌షూ ఆప్షన్ కారణంగా ఐపీవో జారీ చేసిన కంపెనీలకు కొంత మేర ప్రయోజనం ఉంటుంది. జారీ చేసిన వాటాల ధరలలో హెచ్చు తగ్గుదలతో కంపెనీలు ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా గ్రీన్‌షూ దోహదపడుతుంది. సాధారణంగా ఐపీవో ద్వారా కంపెనీలు చాలా వాటాలను ఒకేసారి జారీ చేస్తాయి. ఐపివోలో కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియడం జరుగుతుంది.
ఏ కంపెనీలైతే ఐపివోను జారీ చేస్తున్నాయో ఆ కంపెనీలు గ్రీన్‌షూ ఆప్షన్ వల్ల కావాల్సిన మూలధనం కన్నా కొంత మేర ఎక్కువగా కూడా సేకరించవచ్చు. అయితే గ్రీన్‌షూ అనేది కంపెనీ జారీ చేయబడిన షేర్ల మొత్తం విలువలో 15శాతంకు మించరాదు. ఐపివో పోస్ట్ లిస్టింగ్ జారీ చేయబడిన 30రోజులపాటు షేర్ల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈక్విటీ షేర్ల అమ్మకం సందర్భంగా షేర్ల ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
గ్రీన్‌షూ ఆప్షన్ అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ. x అనే కంపెనీ గ్రీన్‌షూ ఆప్షన్‌ను ఉపయోగించి 10శాతంతో 5 మిలియన్ షేర్లను జారీ చేసిందని అనుకుందాం. ఆ తర్వాత కంపెనీ షేర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్‌షూ ఆప్షన్‌తో అదనంగా మరో 5లక్షల షేర్లను జారీ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీలకే కాకుండా గ్రీన్ షూ ద్వారా పెట్టుబడిదారులకు కూడా ప్రయోజనం ఉంది. మార్కెట్లలో కంపెనీల వాటాల ధరలను స్థిరంగా ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications