For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎమ్ఐ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు?

By Nageswara Rao
|

Equated Monthly Installment
EMI అంటే "సమానంగా పరిగణించు నెలసరి వాయిదా" (EMI). రుణగ్రహీత ప్రతి నెలా రుణదాతకు చెల్లించే మొత్తం. ఈ ఈఎమ్ఐ అనేది కారు లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి మీద లెక్కిస్తారు. రుణ గ్రహీత తీసుకున్న ప్రధాన మొత్తానికి వడ్డీ కలిపగా వచ్చిన మొత్తాన్ని నెలలు సంఖ్యతో విభజించిన తరువాత.. వాయిదాలలో డబ్బు కట్టే విధానాన్ని ఈఎమ్ఐ అంటారు. ఈఎమ్ఐని బ్యాంకులు ఎలా లెక్కిస్తారు. ఈఎమ్ఐని లెక్కించే ప్రక్రియ బ్యాంకును బట్టి మారుతుంది. బ్యాంక్ అందించే వడ్డీ రేట్లపై ఆధారపడి.. మీరు తీసుకున్న లోన్ మొత్తం చెల్లించే కాల పరిమితిని బట్టి ఈఎమ్ఐ ఉంటుంది.

ఈఎమ్ఐని లెక్కించడం ఎలా?

ఈఎమ్ఐని లెక్కించడం అనేది ప్రధానంగా రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ప్రధాన మొత్తం... రెండవది వడ్డీ రేటు. వీటితో పాటు EMI వడ్డీ రేట్లు, రుణ మొత్తాన్ని మరియు తిరిగి చెల్లించే యొక్క పదవీకాలం వంటి కారకాలను ఉపయోగించి లెక్కించబడుతుంది.

Formula used is: EMI= (loan amount*interest) * (1+interest)^n [(1 + Interest)^n] - 1

ఉదాహారణ:
రుణ మొత్తం రూ 10, 00.000
వడ్డీ రేటు: 11/12 = 0,0091
రుణ కాలం (n) = 15 సంవత్సరాలు = 180 నెలలు

EMI = (loan amount*interest) * (1+interest)^n [(1 + Interest)^n] - 1
EMI = (10,00,000*0.0091) * 1+0.0091) ^180 [(1+ 0.0091) ^180]-1

ప్రతి నెలా వడ్డీ రేటు, ప్రధాన మొత్తంతో పాటు కలిపి రూ 11, 365,96లను EMIగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈఎమ్ఐ చెల్లించే విధానంలో బ్యాంకులు రెండు రకాలైన పేమెంట్ విధానాల్ని అవలంబిస్తున్నాయి. ఒకటి ఫిక్స్‌డ్ రేట్.. రెండవది ప్లోటింగ్ రేట్.

ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ:

ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ అంటే రుణ గ్రహీత ఈఎమ్ఐ చెల్లించే పదవీకాలం మొత్తం ఒకే ఈఎమ్ఐని చెల్లిస్తుంటాడు. వడ్డీ రేటు తక్కువగా ఉండేందుకు ఈ ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ ఎంతో ఉపయోగం.

ప్లోటింగ్ రేట్ ఈఎమ్ఐ:

ప్లోటింగ్ రేట్ ఈఎమ్ఐ అంటే మార్కెట్, ఎకానమీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానాలకు అనుగుణంగా ఈఎమ్ఐ మారుతూ ఉంటుంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఈఎమ్ఐ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు? | What is EMI? How is it calculated? | ఈఎమ్ఐ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు?

Equated Monthly Installment (EMI) is the amount paid by borrowers each month to lender of the loan.
Story first published: Wednesday, May 15, 2013, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X