
ఇలాంటి ప్రశ్నలు కేవలం ఒక్క రామకృష్ణ అనే వ్యక్తికే కాదు మనలో చాలా మందికి ఇలాంటి సందేహాలు వచ్చే ఉంటాయి. అందుకే వన్ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతా(సేవింగ్స్ ఎకౌంట్), ప్రస్తుత ఖాతా (కరెంట్ ఎకౌంట్) అంటే ఏమిటో వివరిస్తున్నాం.
పొదుపు ఖాతా(సేవింగ్స్ ఎకౌంట్):
పేరులో ఉన్న విధంగా పొదుపు ఖాతా(సేవింగ్స్ ఎకౌంట్) అంటే మన డబ్బుని దాచుకునే ఖాతా అన్నమాట. ఎవరైనా సరే ఈ సేవింగ్స్ ఎకౌంట్‌ని ఓపెన్ చెయ్యవచ్చు. ఈ పొదుపు ఖాతాను సింగిల్‌గా లేదా జాయింట్ కూడా కలిగి ఉండవచ్చు. సాధారణంగా భారతదేశ ప్రభుత్వానికి చెందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతాను ఓపెన్ చెయ్యాలంటే కనీస బ్యాలెన్స్ రూ. 1,000గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల్లో పొదుపు ఖాతాను ఓపెన్ చెయ్యాలంటే రూ. 10,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంది.
ఐతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడు ఒక బ్యాంక్ ఎకౌంట్‌ని కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో జీరో బ్యాలెన్స్‌తో కూడా ఎకౌంట్‌ను ప్రజలకు అందిస్తున్నాయి. ఇక ప్రస్తుత ఖాతాతో పోల్చి చూస్తే పొదుపు ఖాతాకి వడ్డీ రేట్లను ఎక్కువగా బ్యాంకులు అందిస్తున్నాయి. పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఖాతా (కరెంట్ ఎకౌంట్):
ఈ ప్రస్తుత ఖాతా (కరెంట్ ఎకౌంట్) అనేది ఎక్కువగా వ్యాపార వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉపయోగిస్తుంటారు. ఒక వ్యక్తి ఎక్కువ కంపెనీలు కలిగి ఉండి.. రోజు వారీగా ఎక్కువ లావాదేవీలను జరుపుతుంటే అటువంటి వారికి ఈ ఎకౌంట్ ఎంతో ఉపయోగం. ప్రస్తుత ఖాతా (కరెంట్ ఎకౌంట్)లో ఉంచిన డబ్బుకి ఎటువంటి వడ్డీ రాదు... అంతే కాదు రోజు వారీగా చేసే లావాదేవీలకు లిమిట్ ఉండదు.
| పొదుపు ఖాతా(సేవింగ్స్ ఎకౌంట్) | ప్రస్తుత ఖాతా (కరెంట్ ఎకౌంట్) | |
| Purpose | To encourage saving | Many transaction |
| Ideal for | Salarised person | Business person |
| Minimum Amount | Less amount | Heigher amount(depending on the bank) |
| Interest Rates | 4% - 6% | Normally, no interest is paid |
| Documents Required | ID Proof, Address Proof, Photographs, Reference of existing account holder | ID Proof, Address Proof, Photographs, Proof of Business entity |
| Over Draft | Not Allowed | Allowed |
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications