మ్యూచువల్ ఫండ్ పథకాల్లో దరఖాస్తు ఫారం నింపడం ఎలా?
మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో డబ్బుని మదుపు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తొలుత మనం దరఖాస్తు ఫారం నింపాలి. ఈ ఫారంలో దకఖాస్తుదారుని పేరు, చిరునామాతో పాటు అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయాలి. పాఠకుల కోసం ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్ పథకాల్లో దరఖాస్తు ఫారం నింపడం ఎలానో క్లుప్తంగా అందజేస్తున్నాం. మొదటగా దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారు పేరు, చిరునామా, ఎన్ని యూనిట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో తదితర వివరాలను దరఖాస్తుదారు స్పష్టంగా తెలియజేయాలి. ఇది మాత్రమే కాకుండా దరఖాస్తుదారు తన యొక్క బ్యాంకు ఖాతా నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఎందుకంటే భవిష్యత్ లో మ్యూచువల్ ఫండ్ వారు డివిడెండ్ (లాభాల వాటా) ఇచ్చినప్పుడు కాని లేదా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు కాని జారీ చేసే చెక్కు/ డ్రాఫ్ట్‌లు సక్రమంగా ఉండేందుకు.. మోసపూరిత నగదుగా మార్చుకోవడాన్ని అరికట్టేందుకు ఈ బ్యాంకు ఖాతానెంబరును మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ తప్పనిసరి చేసింది. దరఖాస్తు ఫారంను ఎలా నింపాలో ఇక్కడ చూద్దాం.

ఏజెంట్ కోడ్‌ని వ్రాయండి లేదా డైరెక్టుగా పెట్టుబడి చేస్తుంటే బాక్సులో డైరెక్ట్ అని వ్రాయండి.

ఫోలియో నెంబర్‌ను వ్రాయండి.

KYC రసీదుతో పాటు సంతకం చేసిన మీ పాన్ కార్డు కాపీని పొందుపరచండి.

స్టేటస్‌తో పాటు ఏమి చేస్తున్నారో వ్రాయండి.

A. యూనిట్ హోల్డర్ డిటేల్స్ పొందుపరచండి.
B. పిన్ కోడ్ తప్పనిసరి.
C. ఎకౌంట్ స్టేట్‌మెంట్స్.
D. నోటరీ చేయించిన పాన్ కార్డు జత చేయండి.

చిరునామా తప్పనిసరి.

A. లావాదేవీలకు బ్యాంక్ ఎకౌంట్ తప్పనిసరి.
B. విదేశాల నుండి డబ్బు పొందేవారు వారి విదేశీ ఎకౌంట్ జత చేయాలి.
C. ఆర్డినరి ఎకౌంట్
D. ఫారెన్ కరెన్సీ కోసం విదేశీ ఎకౌంట్.

లావా దేవీలకు బ్యాంక్ ఎకౌంట్ ఎందుకు తప్పనిసరి.

ఏదైతే కంపెనీది మ్యూచవల్ ఫండ్ తీసుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క స్టాంప్, సంతకం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.

A. అభివృద్ధి ప్రణాళిక
B. డివిడెంట్ ప్లాన్

చెల్లింపు వివరాలు

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నామినికి ఎందుకు అంత ప్రాముఖ్యం.

కావాల్సిన పత్రాలను జత చేయండి.

మదుపుదారులు వారికి రావాల్సిన డబ్బుని చెక్కు లేదా డైరెక్టుగా బ్యాంక్ ఎకౌంట్‌కి వచ్చేలా ఎంపిక చేసుకోవాలి.

మీరు ఏమి ప్రకటించారో ఇక్కడ పేర్కొండి.


Click it and Unblock the Notifications