
మదుపు లక్ష్యాలు కలిగిన ఫండ్స్‌ను మదుపరులకు తగిన రీతిలో ఎన్నో ఇన్సూరెన్స్ సంస్దలు అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ సంస్దలు అందించేటటువంటి ఫండ్స్ కాలపరిమితో కూడుకున్నవి మరియు నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఒక పాలసీదారు కొంత సొమ్మును కొన్ని సంవత్సరాలపాటు దీనిపై వెచ్చించాడని అనుకుందాం. అతని సొమ్మును, సంభవింపబోయే నష్టాన్ని అతను తట్టుకోగలిగే స్థాయి ఆధారంగా ఈక్విటీలుగా, రుణాలుగా రెండింటిపైనా పెట్టుబడి చేస్తారు. ఇందులో అనేక పథకాలు ఉంటాయి. కొన్ని పథకాల్లో పాలసీదారులకు, వారు పాలసీ పాలసీ కాలం ముగిసేవరకూ జీవించి ఉన్నట్లయితే నిర్దిష్ట మొత్తంలో సొమ్మును హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఐతే ప్రీమియం మొత్తాలు చాలా అధికంగా ఉంటాయి.
ఉదా: 30 సంతవ్సరాల వయసు కలిగిన వ్యక్తి రూ 10 లక్షల మొత్తాన్ని హామీ ఇచ్చే 20 సంవత్సరాల యులిప్‌ను కొనుగోలు చేసినట్లేతే అతను చెల్లించాల్సిన ప్రీమియం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ఉండవచ్చు. (హామీ ఇవ్వబడిన మొత్తం అనేది ప్రీమియంకు ఐదు రెట్లు). కాగా, మరోవైపు బీమాలో అత్యంత స్వచ్ఛంగా భావింపబడే టర్మ్ ప్లాన్లో ఇందుకు అయ్యే వ్యయం కేవలం రూ. 3,370 మాత్రమే. ఇందులో ఒక సమస్య ఉంది.
బీమా చేసిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, టర్మ్ ప్లాన్‌లో చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రూ. 67,400 (3,370 × 20 సంవత్సరాలు) కోల్పోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాల దృష్ట్యా చూస్తే, ఆ తేడా సొమ్ము రూ. 21,630 (రూ. 25,000 - రూ. 3,370) మదుపు చేసినట్లయితే 8 శాతం ఆదాయాన్ని అందించే ఏ పథకంలో అయినా రాబడి అదే విధంగా రూ. 9.8 లక్షలు వరకూ ఉంటుంది. అందులో కూడా మొత్తం టర్మ్ ప్లాన్ సొమ్ము రూ. 67,400 కోల్పోవాల్సి ఉంటుంది. యులిప్ అనేది మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున, ఈ ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది. ప్రయోజ నాన్ని అందిచాల్సిన సమయంలో మార్కెట్లో ఉండే అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం.
యులిప్ పథకం వల్ల లాభాలు:
'లాక్-ఇన్' పిరియడ్ కారణంగా స్టాక్స్‌ను కలిగి ఉండేందుకు ఫండ్ నిర్వాహకులకు ఎక్కువ కాలం లభిస్తుంది. యులిప్ ద్వారా వచ్చే రాబడికి పూర్తి మినహాయింపులు వర్తిస్తాయి. ఒక సంవత్సర కాలంలో 100 శాతం రుణాలు-ఈక్విటీ స్కీములకు మారేందుకు నాలుగు సార్లు ఉచితం.
యులిప్ పథకం వల్ల నష్టాలు:
ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, మోర్టాలిటీ రేటు వంటి వాటికి అయ్యేటటువంటి వ్యయం అధికం. నాక్-ఆఫ్ యూనిట్స్ వ్యయం ముందుగానే చెల్లించాల్సి రావడం.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications